Thursday, October 4, 2012

రమణీ రమ్మనెను సీ త రాముని గనుచున్

రమణుని  జూ డను  ద్రిజటా
రమణీ రమ్మనెను సీ త,  రాముని  గనుచు
న్నమితమగు  సంత సమ్మును
విమలముగా  బొందె నపుడు విల్లును  విఱు వన్ .

పద్య రచన -133,కంస సంహరణ ము

మేనమామని  జూ డక  మృతుని  జేసి 
యవని  బ్రజలను  బ్రోచిన  యాద వేంద్ర !
దుష్ట  శిక్షణ  మఱియును  శిష్టు  బ్రోవ 
యవత  రించితి  వీ వయ  యవని యందు .

Wednesday, October 3, 2012

పద్య రచన -132.కా శీ క్షేత్రము

కాశి కాపురమున  గనిపించు నాలయ 
ములను  గనుల  గాంచ  మోక్ష  మరయ 
సంభ  వించు  నయ్య ! సత్య ము  సుమ్మిది 
శివుని  జూ డ వేరె  చెప్ప  నేల ?

పద్య రచన -131,అన్నము, విస్తరి

కూర  పప్పును  సాంబారు  కూడి  యున్న 
విందు  భోజన  మయ్యది   తిందు  మిపుడు 
రండు  వేవేగ  మీరలు  రాము  గుడికి 
అన్న దానము  జరిగె వెం  కన్న  చేత .

తిరుమ లేశు డైన దిరిప మెత్తె .

వేంక టేశు  డడుగ  పెండ్లి  చేసి  కొనుట
కు , మఱి  సొమ్ము  నిచ్చె  కూ డ దీసి
యా కు  బేరు  డాత  డానంద  బడగను
తిరుమ  లేశు  డైన  దిరిప  మెత్తె .

 

Monday, October 1, 2012

హింస కలుగ జేయు హితము భువికి

 ధీ రు డైన వాని భీ రుని  గానిల
హింస  కలుగ జేయు,  హితము  భువికి
ప్రాణ  హింస  మాను ప్రతిన సే  యంగను
హింస  కలుగు  నెడల  హేయ  మదియ .

పద్య రచన ---గాం ధీ జీ .

చూ డ జాలక  లోకంబు  జూ  డ్కు  లవియ
మూ త బడినవి  యౌ రౌ ర  ముఖము  దించె

నేమి  చేతుము ? తాతయ్య ! యెవరు  దిక్కు ?
రమ్ము  గాం ధి జీ ! వేగమె  మమ్ము  గావ .