Monday, October 7, 2013

వేపపుల్ల

వేపపుల్ల నమల వెగటుగా నుండును
పండ్లుతోమ తెల్లబడును మిగుల
పిప్పి పన్నులుండవెప్పటికినిమఱి
వేపపుల్ల మేలు వేనవేలు

చి.సౌ.హిరణ్మయి-హర్షలకు ఆశీస్సులు



1.వధువు పుట్టెను బెహరాల వారి యింట
వరుడు జన్మించెపోతరాజుల కులమున
హర్షవర్ధనుడాతడు నామెదుర్గ
జోడుకుదురగ మూర్తము  జూసి నారు.

2.ఒకరి కొఱకునై మఱియొక రుద్భవించి
అగ్ని సా క్షి గ   పరిణయ  మగుట కొఱకు
వేచి యుం డిరి  పెద్దల  యా  శి సులకు
అనుమతీయగ  నీరోజు  నగును  బెండ్లి

3. రామ చం ద్రుడు నీ తండ్రి రామ యైన
త్రిపుర సుందరి నీ తల్లి తెలియు మమ్మ !
యేమిభాగ్యము నీ యది యెంచ దుర్గ !
భర్త పేరును  గలిసెను ఫ ణి యనంగ

4.తనర  మణి కం ఠు డనబడు తనయు డితడు
 తగిన  భర్తయే మఱి నీకు తార తమ్య
ములను నెంచక సంతోష ముండునటుల
మెలగు మోదుర్గ ! యదినీకుమేలునిచ్చు

అమ్మనాన్నలవిడిచియు నరుగుదేర
బెంగయుండును నిజమిది బేలనీకు
అత్తలోననజూడుమ యమ్మనికను
బాధయుండదు యికనీకు పచ్చినిజము

6.అత్తమామలు మఱియును నాడు బిడ్డ
మిగుల సౌమ్యులువారిని మీఱకుండ
అధిక భక్తిని  మెలగితి  వైన నిన్ను
రక్ష సేయును నిరతము రాము డబల !

7.పుట్టి నింటను మెలగిననట్లు గానె
మెట్టినింటనుగూడను మెలగుమమ్మ!
ఆది దంపతిసములగు నత్తమామ
లాదరించుమునిరతము హర్షమునన

8.మానవత్వంబుతోడన మసలుకొనుచు
మానినులయందగుమతలమానికముగ
పిల్ల పాపల తో డన  చల్లగాను
నిండు నూ రే ళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున


9.మాస్టరీకెయం   యన్నులు  మమతతోడ
మిమ్ము నాశీర్వదింతురుమింట నుండి
కల్లకాదిది నిజమునే పల్కు చుంటి
నోహిర ణ్మయి! సీవీవి పాహి మిమ్ము.

10.సకలశుభములుగలిగించు శంకరుండు
ఆయురారోగ్య సంపదలన్నియిచ్చి
కంటికిని  ఱెప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల  మిమ్ముల  చల్ల గాను



ది.23-10-2013తేదీనహిరణ్మయి-హర్షల  వివాహము  సందర్భముగా
రచన--పోచిరాజుసుబ్బారావు
















 

Sunday, October 6, 2013

ప్రణయ కలహము

ప్రణయకలహములనునవిపడతులందు
విరివిగాకాని పించును తరచి చూడ
ప్రేమతోడన దరిజేరి ప్రియము పలుక
తొలగిపోవును గోపము తోయజాక్షి!

ఆనపపాదునకుజూడ ననుములు పండెన్

నానాజీ తోటనగల
ఆనపపాదునకుజూడ ననుములు పండెన్
గా ననుచుండిరిజనములు
వీనులకది బాగులేదు వినుటకు సామీ!

త్ర్యయంబక సంభవుడు మఱదియగు శ్రీపతికిన్

లంబోదరుడగు గణపతి
త్ర్యoబక సంభవుడు మఱదియగు శ్రీపతికిన్
బింబానన! కుంతిసుతుడు
అంబుధిశయనునకినిడుదు  నంజలి యెపుడున్

Saturday, October 5, 2013

ఓమనగుంటలు

ఆమనిఋతు దినములలో
గోముగ నట నాడెవారుగుంపుగపడతు
ల్వోమన గుంటలలనాటను
ప్రేమను మఱి  యొకరికొకరుప్రియములు గలుగన్

aasiissulu--sekarana



కంటి కింపగు కళ్యాణ మంటపమున

హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి

శుభ సుఖంబుల జీవన శోభ నంద

దీవెనల నీయ మీ జంట దీప్తినందు.



కలకాలము మీ రిద్దరు

కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప

త్నులు మిత్రులుగా కష్టం

బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.



ఎల్లప్పుడు మీ జంటకు

నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్

కొల్లలుగ నందవలెనని

యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.



సరిలేని శుభ సుఖంబుల

సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు

స్థిర దాంపత్యముతో మీ

రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్.