Friday, December 6, 2013

పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముడగున్

చాలిన బలమును బొందును
పాలను గ్రోలిన మనుజుడు , పాపాత్ముడగున్
ఆలను చంపిన యెడ లను
ఆలను భావించ వలయు  నమ్మల వోలెన్ 

రాము నిం జంపె రణమున రావ ణుండు

కలను గంటిని రాతిరి కలత జెంది
రాము  నిం జంపె  రణమున రావ ణుండు
భయము తోడన లేవగ , భ్రమగ  నెఱి గి
సంత సించితి  మదిలోన  వంత లుడగ 

Thursday, December 5, 2013

పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్

అండగ నుండిరి యన్నకు
పాండు కుమారులు  నలుగురు పదుగురు మెచ్చన్
భండనము నందు మిగులను
గండ రు  గండరుల బోలి  కను విందాయెన్ . 

Tuesday, December 3, 2013

పిట్ట కూతకు , ది శ లెల్ల బిట్టు వడకె

పారి పోయెను పక్షులు భయము తోడ
పిట్ట కూతకు ,  ది శ లెల్ల బిట్టు వడకె
నడవి మృగములు సహితము నదరి  యపుడు
కూత యెట్టిదో యూహించు  కొనుడు మీరు
 

సైంధవుడు చంపె భీముని సమర మందు

సైంధవుడు చంపె  భీముని సమర  మందు
నమ్మితిర మీరు ? మఱి యది నమ్మ దగునె ?
నిలువ జాలునె ? భీముని  బలము ముందు
తెలిసి  మఱియును  నిటులుగ దెలుప  దగునె ?

కాలకూట విషము మేలు జేయు

ప్రాణ హాని జేయు పరమాత్ములకు నైన
కాలకూట విషము  మేలు జేయు
ఆత్మ హత్యకు మఱి యారాట పడునట్టి
మానవునకు నిదియ  మఱి  తలపగ 

Monday, December 2, 2013

కాల చక్రము నాపుట, కడు సులభము

ఎవరి దరమును గాదార్య ! యిప్పుడమిని
కాల చక్రము నాపుట,  కడు  సులభము
ముక్తి నొందుట నేరుగా భువిని మఱి ని
భక్తి శ్రధ్ధల బూజించ  పరమ శివుని