Sunday, March 2, 2014

రావణుని పత్ని సీతమ్మ రామ భగిని

మయుని కొమరిత మండోద రి,యర యంగ
రావణుని పత్ని, సీతమ్మ, రామ భగిని
కిన గు వరుసకు వదినమ్మ కీ రవాణి !
బంధు  రికములు దెలియంగ బఱగు నిటుల . 

పద్య రచన -అందాల భామ

ఇట్టి యతిలోక సుందరి యెక్క డైన
ఉండు   నా య ను  ననుమాన మొదవె నాకు
రంభ , యూ ర్వశి దలదన్ను  రామ యీ మె
అందమందున  నంతటి  యంద గత్తె 

ఆరాత్రియు మేలుకొనిన నాయువు పెరుగున్

రారాని జబ్బు లొదవు
 న్నా రాత్రియు మేలుకొనిన నాయువు పెరుగున్
మారాము చేయకుండగ
నా రాముని  సేవజేయ  ననుదినముదగన్ 

విటులు మఱు పుట్టువున నేల వేల్పులు గద

పాండురోగిగ  నిరతము బాధ పడును
విటులు  మఱు పుట్టువున , నేల  వేల్పులు గద
భక్తి  శ్రధ్ధల  బూజింత్రు  భవుని నిలను
నాయు రారోగ్య సంపద లందు కొఱ కు


 

Saturday, March 1, 2014

తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్

సొలసిరి జనములు పులసల
తలకాయల పులుసు త్రాగి, తనిసిరి బాపల్
పులిహోర గలిపి బూరులు
మెలమెల్లగ దినిన పిదప  మించిన రక్తిన్ 

పద్య రచన -అరటి పండ్లు

ఆ ఱు సంఖ్యన గలయట్టి యరటి పండ్లు
పసుపు వర్ణము తోడన బరగు  చుండి
మెరయు చున్నవి  చూడుడు ,మీరు కూడ
రండి  తినుటకు  మీరును  రయము గాను 

జన్మ దిన శుభా కాం క్షలు

పుట్టిటి వట యీ రోజున
పుట్టిన దామోద రుండ !పూర్ణిమ చంద్రున్
బిట్టుగ బోలుచు వెలుగుము
నట్టింటను దిరుగు చుండి నలుగురి లోనన్

ఎనుబది దాటిన వాడవె
యనువై యారోగ్య మార్య ! హాయిగ నుండ
న్ననయము మృత్యుం జయునే
పనిగొని సేవించు మెపుడు భక్తి యుతముగన్

జరిపింతువు కళ్యాణము
జరిపింతువు భేషు పలుక జనములు నీకున్
జరిపింతువు రామునికిట
జరిపింతువు సీతతోడ సర్వులు మెచ్చన్

బంధు ప్రీతిని గలిగిన బాంధ వుండ !
స్నేహ సంపద నొందిన  స్నేహ శీల !
శ్వేత వస్త్రము ల్ధరియించు వినయ శీల !
సాటి యెవరయ్య ! నీకిల  సాటి యెవరు ?

సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయురారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్పయట్లయి కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల జల్లగాను

(శ్రీ దామోదర శాస్త్రి గారి పుట్టిన రోజు సంద ర్భముగా )