Thursday, December 4, 2014

పద్య రచన సతీ సావిత్రి యముడు

చిత్ర మందున ధర్ముడు చిత్రముగను
చేతు లొగ్గియు దండముల్సేయు చుండి
 సత్య వంతుని బ్రాణాలు  సంత సమున
నిచ్చె సావిత్రి కాయన నిచ్చ వొడమె

Wednesday, December 3, 2014

పద్య రచన -పకోడీలు

ఆకు  నిండప  కోడీలు నలరి మిగుల
రెండు రకముల పచ్చళ్ళు నిండు గాను
నుండు పళ్ళెము జూడగ నూరె నోరు
తెచ్చి యీయవ ! మఱి నాకు దేజ ! నీవు

కోల కోలగ నున్నవి గొన్ని యచట
పోలె యవి పకో  డీలను బూర్తి గాను
గురువు లంటిరి యవి చిట్టి గారె లెయని
గురువు జెప్పిన మాటయే గురియ మాకు

చిన్న చిన్నగ నుండును చిట్టి గారె
లవియ ,యోసామి !యిష్టము హరున కెంత
 గా నొ ,నైవేద్య మిడుదురు గ్రామ ప్రజలు
శివుని కళ్యాణ శుభ వేళ చేరి గుడిని

ఆహ్వానము (తాతా సందీప్ అవధాని )

ఆహ్వానము నేగాం చితి
నాహ్వానిత గురువు పంప హా ! సందీ పా !
యాహ్వా  యనుచును జనములు
నూ హలలో దేలునటుల ,నొనరగ నీవున్

అవధానం బొ నరింపుము
అవధానపు చక్రవర్తి !యాశుగ నపుడు
న్నవధానము లన్నిట నీ
యవధానమె గొ ప్పదనుచు నందఱు బొగడన్

Tuesday, December 2, 2014

న్యస్తాక్షరి-- ‘ద - ది - దు - దె’ ( ప్రా సాక్షరాలు గా ; మయసభలో దుర్యోధనుడు )


అ  దరెను మయసభ  యచ్చట
య దిగదిగో గుంత  యిచట యచ్చట గోడన్
చదునైన నేల యిక్కడ
యదె  లేనిది యుండునటుల ననిపించె నుగా



పద్య రచన -పసుపు

పసుపు ముద్దను జూడుము భామ ! యచట
పసుపు ఘాటును దాళ క పారి పోవు
చుండె బురుగులు ,మఱియును శుభము కొఱకు
వంట కొఱకును గూడను వాడుదురుగ
గృహము లందున మనవారు నహరహమ్ము !

Monday, December 1, 2014

పద్య రచన -గ్రంధాలయము

గ్రంధము లుండిన చోటును
గ్రంధాలయ మండ్రు బుధులు గావ్యా ! వింటే ?
గ్రంధాలయము నకున్  మఱి
గ్రంధాదులు జదువ వెళ్ళు జ్ఞానము పెరుగున్ 




30-11-2014 -- మేము సైతము

మేము సైతమనుచు బ్రేమ మీరగ జిత్ర
రంగ మంత కదలి రమ్య మలర
టీవి వారు కూడ టీములో గలువగ
నాట పాట తోడ నలర జేసె

ఆదు కొన వలెనను దృష్టి  నార్తులనట
చిత్ర రంగము నేకమై చిత్ర చిత్ర
కార్య క్రమము ల జరుపుచు నార్య జనుల
నాశిసు లనందు  కొనియెను హర్ష మొలుక

ఆట పాటల తోడన హావ భావ
ములను గనబఱ చి మనము  ముదము గలుగ
నట్లు  గ బ్రదర్శ నలీయ నాకసమును
దద్ద రిల్లెను జూడుమా దద్ద రింత

ఝాన్సి సుమనలు పోటీగ సభను నడుప
సినిమ హీరోలు మఱి యును హీరొ యినులు
వారె కాకుండ టీవి క  ళాభి మాను
లెల్ల కూర్చుండె సముచిత స్థ లము లందు

టీవి  హీరోలు  మఱి యును  హీరొ యినులు
సదరు ప్రోగ్రాము నందును సహితు లగుచు
హావ భావాల చేతను నవని జనుల
హర్ష మొందించు చుండెను గరము వారు

ఆట పాటలు నృత్యము ల్లదరి పోగ
హాస్య మచట ను బాగుగ లాస్య మాడె
నాలి మొదలగు వారల హాస్య మచట
నవ్వు చిందించె కడుపుబ్బ నటన తోడ

జరుగు నీ యది యీరోజు నిర్వి రామ
ముగను బగలంత మఱి యును  సగము రాత్రి
వరకు నోయమ్మ !నీవును బయలు దేరు
చూడ దీనిని యిదియ నా  వేడుకోలు

ఇందు మూలము వచ్చిన యీ ధ  నమును
నార్త జనముల నందరి యార్తి నినిక
దూర ముండజే యుటకునై దురిత దూర !
ఖర్చు పెట్టుదు  రోసామి ! ఖచ్చితముగ

మానవత్వము గలిగిన మనుజు లార !
చేయి చేయిని గలపండి చెయిదములకు
నందరమ్మును గలిసియే యాదు కొనెద
మార్త జనమునట వి శాఖ పురము నందు