Sunday, June 7, 2015

పద్య రచన - గవ్వలు

గవ్వల జూడగ బటమున 
రివ్వున మఱి వా  లనటకు  రెప రెప లాడెన్ 
అవ్వా ! నామది  నిజమిది 
గవ్వల రుచి జెప్ప దరమె ? కన్నడి  కైనన్ 

Saturday, June 6, 2015

గీత నిస్సారమని చెప్పె కృష్ణు డౌర !

గీత నిస్సారమని చెప్పె కృష్ణు డౌర !
యనుట కాదుస  మంజస  మార్య ! మీకు
గీత బోధించె గ్రీడికి కృష్ణుడు గద
మనకు  గాదె ప్రా  మాణిక మైన  దదియ ?

Friday, June 5, 2015

అందఱ కును గీడు గల్గు యాగము జేయన్

మందుల గల్తీ గలిపిన
నం దఱ కును గీడు గల్గు యాగము జేయన్
వందనములు నే  జేతుబ
సందుగ నాసోమయాజి శర్మకు  నెపుడున్


Wednesday, June 3, 2015

కవులు గాంచని వెల్లను రవియె కాంచు

కవులు గాంచని వెల్లను రవియె కాంచు
నిజము  ముమ్మాటి కీ మాట  విజయ ! నమ్ము
రవికి  కాంచలే  నటువంటి యవని గలదె ?
యన్ని చోటుల వ్యాపించు నతని కాంతి 

Tuesday, June 2, 2015

సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే

కాముని దహియించెను గద
సోముడు, నిప్పులను గురిసె సూర్యుని వలెనే
సోముడ  నంగుని  గాంచగ
కామము మఱి గౌరి పైన  గలుగుట వలనన్ 

గరుడుని గని సంతసించు గద భుజగమ్ముల్

ఉరగములు పాఱి పోవును
గరుడుని గని, సంతసించు గద భుజగమ్ముల్
కరముం బిల్లన గ్రోవిన
బరగను నా దస్వరమ్ము  పాడగ నపుడున్ 

పద్య రచన -పిల్లలు మొక్క నాటుట

భావి భారత  యింతులు  భవ్య ముగను 
ముద్దు లొలికించు  మొగముతో ముద్దు గాను 
నాటు చుండిరి మొక్కను  నగవు తోడ 
చూడ  ముచ్చట  గగలరు  చూడుమార్య !