Wednesday, June 10, 2015

పద్య రచన -అరిసెలు

అరిసెలు సేతురు విరివిగ
నరయంగా బెళ్లి జరిగి నపుడు వనితలే  
యిరవుగ  నీయగ  సారె గ 
పొరపుచ్చెము తొలగ కొఱకు పోడిమి తోడన్



పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే

పద్యము వ్రాయుట  నేర్చుకు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే !
హృద్యముగ వ్రాయువారిని
నాద్యంతము మెచ్చు కొండ్రు  హర్షము తోడన్ 

కాముకులు పవిత్రు లనుట కల్ల యె టులగున్ ?

భీముని  సందియ మిదియే 
కాముకులు పవిత్రు లనుట కల్ల యె టులగున్ ?
కామము గలిగిన వారలె 
యీ మాదిరి తలతు రెపుడు నీయది  నిజమే 

Tuesday, June 9, 2015

పద్య రచన -అమ్మ

మొదటి చిత్రము జూడగ మోద మయ్యె
కన్న ప్రేమను  దెలిపెను మిన్న గాను 
దిగువ చిత్రము  జూడగ తెలివి కలిగి 
పెంచు ప్రేమకు  వందనం బిత్తు సామి !


అమ్మను మించిన దైవ
మ్మిమ్మహిలో గానరాదు నెందు వెదకిన
న్నమ్మయె మన తొలి గురువయె
నమ్మకు జేజేలు గొట్ట హాయిని గూర్చున్.


పద్య రచన -వాస్తు

వాస్తు దోషము లేకుండ  వనజ ! నీవు 
కట్టుకొనినచో  నింటిని గట్టి గాను 
నాయు రారోగ్య  సంపద లన్ని గలిగి 
జీవనమ్మును గలుగున  జేయ ముగను 

పతివిడ నాడిన సతికి శుభమ్ములు గలుగున్

అతలా కుతలమె బ్రదుకులు
పతివిడ నాడిన సతికి ,శుభమ్ములు గలుగు
న్బతినిల  సేవించు సతికి
సతతము సంతసము గూడ సలుపగ వచ్చున్

Sunday, June 7, 2015

పగలు ముగిసి నంత సెగలు రేగె

గుండె నిండ నిదుర  మెండుగ  పోదును
పగలు ముగిసి నంత, సెగలు రేగె
గ్రామ  మందు పగల గారణం  బుగమది
పగలు గలుగు గృహము  భస్మ మగును