Sunday, June 14, 2015
Saturday, June 13, 2015
పద్య రచన -పిల్లలు అమ్మా నాన్న ఆట
పిల్ల లచ్చట మనసున నుల్ల మలర
యాడు చుండిరి చక్కగ నమ్మ నాన్న
యాట లచ్చట చూడుము హరిత ! నీవు
గూడ పోయియా డుకొనుము వీడి నన్ను
యాడు చుండిరి చక్కగ నమ్మ నాన్న
యాట లచ్చట చూడుము హరిత ! నీవు
గూడ పోయియా డుకొనుము వీడి నన్ను
పద్య రచన -అతివలు గోరింటాకు
చిత్ర మయ్యది జూడుము చిత్ర ! నీవు
అతివ లచ్చట గుమి గూడి యందముగను
నొకరి కినొకరు ముదమున నొప్పు గాను
దనరు గోరింటాకు ను బెట్టు కొనుచు నుండె
Friday, June 12, 2015
చెల్లని నోట్లు (RBI వారి సర్క్యులర్ )
రెండు తదుపరి యేక్యూ లు నిండి యున్న
మఱియు నెనిమిది యే సీల మయము గలుగు
వెయ్యి రూపాయి నోటులు వెంకటేశ !
దొంగ నోటుల నిదెలిసి భంగ వడితి
ఇంటి కంటె మఠ ము హితమొసంగు
ఇంటి కంటె మఠ ము హితమొసంగెడుమాట
యక్షరాల నిజము హర్ష ! వినుమ
యింటి లోన పోరు లెక్కువ యైనచో
నదియ మార్గ మునిక నందరకును
యక్షరాల నిజము హర్ష ! వినుమ
యింటి లోన పోరు లెక్కువ యైనచో
నదియ మార్గ మునిక నందరకును
Thursday, June 11, 2015
పసుల గొల్చు జనుల భద్రమమరు
పసుల గొల్చు జనుల భద్రమమరు నిల
పసులు శివుని కిమరి వాహనములు
మనకు పూజ నీయ మనుటలో సందియ
మువల దులలి త ! నిజ ముగను నమ్ము
పసులు శివుని కిమరి వాహనములు
మనకు పూజ నీయ మనుటలో సందియ
మువల దులలి త ! నిజ ముగను నమ్ము
పద్య రచన -బాల కృష్ణుడు తలుపు చాటున
తలుపు చాటున నుండియు దైవ మచట
చూచు చుండెను వెన్నకై చోద్య మరయ
జగము గాపాడు పోషించు శక్తి యుతుడు
దొంగ వోలెను నుండుట రంగ ! కంటె ?
Subscribe to:
Posts (Atom)

గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
ధరణిని నెచట ను జరిగినె ?
పరువము నుందీ య సబబె ! వ్రాయుచు నిటులన్