Tuesday, November 10, 2015

దత్త పది --తాప -పాప -దీ ప -రూప (దీ పావళి )

తాప మణ గను బుడమికి దనరు నట్లు
పాప కర్ముడు  నరకుని బ్రతిమ జేసి
దగ్ధ పఱతురు ,రూపము దహన మగుట
గనెఱి  గి ముదము  తోడన గ్రామ ప్రజలు
దీప ములవెలి  గింతురు  దీ ప్తు లొలుక


Monday, November 9, 2015

ఒక మంచి మాటె చాలును

ఒక మంచి మాటె చాలును
నొకరిని నిల బాగుజేయ నో గురు వర్యా !
యకళం క  మనసు గలిగిన
నొక నేస్తమె  చాలు వాని నూరడి జేయన్ 

కల్లు పాకలో పురుష సూక్తము పఠిం చె

తప్ప త్రాగును నిత్యము తంగ వేలు
కల్లు పాకలో, ,పురుష సూక్తము పఠిం చె
గర్భ గుడిలోన రమభావ  గర్భి తముగ
భక్తు లందఱు మెచ్చగ రక్తి గాను 

పద్య రచన -పూ మాలల్ గడు భక్తి .......

పూమాలల్ గడు భక్తి దెచ్చితిని నీ పూ జార్ధినై దేవరా !
యీ మాలల్  యి క  నీకు సాదరముగా యీ నీ శిరంబందు నే
బ్రేమంబొ ప్పగ వైతు నో శివ ! మరిన్బ్రీ తిన్ ననున్ గావుమా
నామాట ల్  సరియౌను గా దలచి నా కోరికన్  మన్నించవే ?

Sunday, November 8, 2015

శవ పూజల వలన జన్మ సార్ధక మగురా

శవ మనగ నండ్రు శివుడని
శివు డెప్పుడు దప్పకుండ సేమము గూర్చున్
శివ శవములు నొక్క ట గుట
శవ పూజల వలన జన్మ సార్ధక మగురా 

నీతుల్ జెప్పెడి వారలు


నీతుల్ జెప్పెడి వారలు
జేతలలో జూపరార్య! చెప్పుటవరకే
నీతులనుపయో గింతురు
నీతినిబాటించకున్న నేరముగాదే?

కష్టముకద గవితలల్ల గందమునందున్

శిష్టులు కొందరు పలికిరి
కష్టముకద గవితలల్ల గందమునందున్
కష్టముకాదుగ నాకది
యిష్టముగావ్రాయుచుందునెప్పుడునేనున్