Sunday, January 3, 2016

వివాహములో -ఏడడుగుల వివరణ

 మొదటి అడుగు ; జీవితాంతము స్నేహపుర్వకముగా నుండుట

రెండవ అడుగు ; కలిసి మెలిసి ధైర్యముగా నుండుట కొఱకు
మూడవ అడుగు ; పరస్పరాభి వృద్ది కొఱకు
నాల్గవ అడుగు ; ఎల్లప్పటికి ఒకరి కొఱకు నొకరు  జీవించుట కై
ఐదవ అడుగు ; మాన ప్రాణ ధనములను రక్షించుట కొఱకు
ఆరవ అడుగు ; మన పిల్లల భవిష్యత్తు కొఱకు
ఏడవ అడుగు ; సుఖ దుఃఖములను పంచు  కొనుట కొఱకు
---------------
వరుని జేబట్టి నడచును వధువు నిచట
యడుగు లేడును వరుసగ నరయ దాని
యర్ధ మేమన వివరింతు నార్య !నిపుడు
సావధానముగ వినుడు శ్రద్ద్ష గాను

మొదటి యడుగున కర్ధమ్ము  ముదిత ! వినుము
జివితాంతము  మెలగుము స్నేహ పూర్వ
కంబుగను మఱి  నీభర్త కనుల యెదుట
కనులు మీయవి నాలుగు  కలిసి కొనగ

రెండవ యడుగున కర్దము
మెండుగ నిక కలిసి మెలిసి మెలగుట  మేలౌ
నిండగు ధైర్యము కలిగియు
నుండంగా మేలు గలుగు నుర్వి జనులకున్

ఒకరి యభివృద్ధి కొఱకునై నొకరు పూను
ట యది మూడవ యడుగున డచుట యగును
నాలుగవదియ దెలుపును నయము గాను
నొకరి కొఱకునై మఱియొక  రుండ వలయు
జీ వితాంతము  వరకుగా జీవ నంబు

ప్రాణ మాన ధనము పరిరక్ష ణమునిక
అయిదవ యడుగున కర్ధ మబల !
ఆరవది యగు నడుగును నరయ తెలియు
సంతు భావి జీవితమును జక్క దిద్ద

సుఖము మఱియును దుఃఖము జూర గొనుట
కొఱకు గానేడ వయడుగు గూర్చు నుగద
యేడడుగుల బంధమిదియ ,యీ వ చనము
లాల కించుచు వర్తిలు డార్యు లార !



 

WEDNE

పద్య రచన -నచోర హార్యం ........


దొంగిలించగ లేరుగా దొంగలెవరు
పంచు కొనలేరు భాగమ్శు భాతృలెవరు
వశము కాదిదిరేలకు భరణి వినుము
పంచు నెడలను బెరుగును గొంచె మవదు
అన్ని ధనముల గంటెను మిన్న సుమ్ము
విద్య యనబడు ధనమని విదితమయ్యె



బాట పట్టి పోవు వాడుఖలుడు


దుష్ట బుధ్ధి తోడ దురితము ల్గావించు
పురుషు బాట పట్టి పోవు వాడు
ఖలుడు,వాని తోడ మెలగకూ డదెపుడు
దూరముండ వలయు దుష్టులకును

Saturday, January 2, 2016

చైత్రమందు,వినాయకచవితివచ్చు

రమ్య ముగవచ్చు పండుగ రామనవమి
చైత్రమందు,వినాయకచవితివచ్చు
భాద్రపదశుధ్ఢచవితినిభవ్యముగను
పండుగలువచ్చుశుభములువడయు కొరకు

మదిరా పానముచౌర్యమున్ పరసతీ..........


  1. మదిరా పానముచౌర్యమున్ పరసతీమానాపహారమ్మునన్
    మదినీ లగ్నముజేతువేమి యికకామంబొప్పునేనీకిటన్
    చదువేముఖ్యము బాలకా! మరినివేసారింతువిప్పుడున్
    మదికిన్ హానినినోయవియ యే మాత్రంబురానీయకే.

ననుమించిన...........

ననుమిం చినమొన గాడును
ననుమించినమాటకారి  నా కగ పడదే
ననుగురిచిదెలుప యిటులను
ననుమించిన మూర్ఖుడుండునాలోకమునన్

పద్య రచన -వృ ద్దురాళ్ళు

చిత్ర మందున జూడుడు చిత్రముగను
వృద్ధ మరియొక వృద్ధ ను వెనుక తనకు 
నునిచి కొనుచును పోవుచుం డెనట యార్య !
కలియు గపుమార్పు లింకను గలుగుచుండు