Tuesday, May 3, 2016

తెలుగుబాల!

పరులయధికారమునుమీదవైచికొనుట
జోలిమాలినబనికిదాజూరగొనుట
మంచిలక్షణంబదికాదుమానవునకు
దెలియజెప్పితినామాటదెలుగుబాల!

Monday, May 2, 2016

ఖండ కావ్యము -ఋతు చక్రము

ఆరు ఋతువుల సొగసును నంద ముగను 
దనదు ధీశక్తి వర్ణించి తనరె లక్ష్మి 
యాహ ,యేమిర చనయది యద్భు తంబ 
యామె కామెయే సాటి యో యార్యులార !

దీ పా లంకృత గృహమున దిమిరము నిండెన్

దీ పా వళి దిన మున మా
పాపలు సంతో షమున ట పా సులు గాల్చ
న్మా పాక దగ్ధ మగుటన
దీ పా లంకృత గృహమున దిమిరము నిండెన్ 

పద్య రచన -ఉప్పు

ఉప్పు లేని కూర చప్పగా నుండును 
భోజ్య వస్తు వులకు ముఖ్య మదియ 
వనధి నీరు మడుల బారించి యెండన 
నెండ జేసి చేతు రిలను నుప్పు 

కొయ్యగుర్రమెక్కికయ్యమాడె

బుడతడచటయెంతముద్దుగానుండెనో
కొయ్యగుర్రమెక్కి.కయ్యమాడె
నతనిజూచివానియన్నశంకరరావు
గుర్రముతనదియనిగొడవజేసి

పద్యరచన.....పిచ్చుకగూడు

పిచ్చుకగూడునుజూడగ
నచ్చముగాగుహనుబోలియలరెనుమిగుల
న్బిచ్చుకయాగూడునుదా
నిచ్చనురకరకములుగనునేర్పరుచుకొనున్

ఖండకావ్యము......తెలుగువెలుగు

తెలుగుభాషకుగలతియ్యదనమ్మును
నాటవెలదిలోననచ్చుగుద్ది
చదువరులకుసంతసమ్మునుగలిగించు
సఖుడ,సుబ్బరావ!శతమునతులు