Saturday, August 6, 2016

కవిసన్మానమని చెప్ప గాభీతిల్లె న్

పవనా !సన్మానంబును
నవిరళముగజేయుచుండ్రి యచ్చట గనుమా
కవిగా జేతురు నీకన
కవిసన్మానమని చెప్ప గాభీతిల్లె న్

Friday, August 5, 2016

వరుణ దేవుడు కరుణించె గరువువచ్చె

కుండ బోతగ వర్షాలు గురియు టకును
వరుణ దేవుడు కరుణించె ,గరువువచ్చె
వాన లనునవి పడకను భరణి యందు
మొలవ దాయెను గడ్డియు ముఖ్య ముగను 

Thursday, August 4, 2016

సత్య మింకక వనము నిస్సత్త్వ మయ్య

సత్య మింకక వనము నిస్సత్త్వ మయ్య
కాదు గానెప్పటి కినది కమల !యరయ
కవన మనునది యొకగొప్ప కళయ సుమ్ము
సత్త్వ మే యది యట్లన సరియ కాదు 

మరు భూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్

అరయఁగ నెముకల భస్మము
మరు భూమిని దొరకు గాదె, మాణిక్యమ్ముల్
విరివిగ దొరకును జలధిని
తరతర ములనుండి యచట తళుకుల దోడన్ 

సాహితీ సమరాంగణ సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి 507 వ పట్టాభిషేక దినోత్సవము

అష్ట దిగ్గజ కవులను నాద రించు
కొఱకు గాజేయు నట్టి స త్కార మునకు
గురువు శంకరుడెంపిక గూర్చి  వినగ
సంత సంబయ్యె ను మిగుల సములు లార !



Tuesday, August 2, 2016

దత్తపది - 95 (నవ్య-భవ్య-దివ్య-సవ్య)వైద్యవృత్తిని గురించి

భవ్యతకలుగుటకొరకై
సవ్యమమగువైద్యమిచ్చిశంభునిగరుణన్
నవ్యతకనబరచుటకును
దివ్యంబుగనుండునటులదీర్చెనుగుండెన్

Monday, August 1, 2016

సమర శూరులు చీమల జంపు వారు

అర్జు నుండును భీముడు నరయ మిగుల
సమర శూరులు, చీమల జంపు వారు
నభము శుభమును దెలియని యాకతాయి
పిల్లలు సరదా యనుచును నుల్లసిల్లు