Friday, May 26, 2017

మండుటెండలోగురిసెను మంచుజల్లు

తెలుగు రాష్ట్రాల దాహము దీర్చు కొరకు
మండుటెండలోగురిసెను  మంచుజల్లు
లవలెవర్షము వడగండ్ల రవము తోడ
హాయి నొందిరి జనముల య్యవసరమున

Thursday, May 25, 2017

రతిపతి మన్మధుడు,గాడుబ్రహ్మయె తలపన్

రతిపతి యెవరని నరయగ
రతిపతి మన్మధుడు,గాడుబ్రహ్మయె తలపన్
 హతవిధి! యనకుమ యట్లని
పతిదేవుడు వాణికతడు పరమాత్ముండున్

Wednesday, May 24, 2017

మునిసహవాసమంది సతిపొందె ముదంబున పుత్రులిధ్ధరన్

అనయము సేవజేయగ నుహర్షముదోడనదానుమౌనికిన్
మునియునుదుష్టబుధ్ధిని దపోనియమంబును దామరల్చగా
మునిసహవాసమంది సతిపొందె ముదంబున పుత్రులిధ్ధరన్
 మునియనునాతడెప్పుడుతమోగుణమొప్పగ దాచరించుగదా

మునిసాంగత్యమున నారిపుత్రులగనియెన్

వినయము గలిగిన నొకసతి
యనయముదాసే వ జేయ హర్షముతోడన్
 ముని కాముకుడగుటననా
మునిసాంగత్యమున నారిపుత్రులగనియెన్

Friday, May 5, 2017

డాండడ డాండాండడాండ డామ్మనె,వీణల్

మెండుగ టపాసు లక్కడ
డాండడ డాండాండడాండ డామ్మనె,వీణల్
 గండర గండర యనుచును
పండితులే మెచ్చువిధము బాగుగ మ్రోగెన్

Wednesday, May 3, 2017

గోరుచుట్టు

గోరు చుట్టు కతన కొంచెమైనను వ్రాయ
లేక పోతి సామి! యొకటియైన
నిప్పు డిపుడె వాపు నెమ్మదిం చుటవల్ల
వ్రాాయ గలిగి తిదియ వాస్తవముగ

Tuesday, May 2, 2017

నడక హానికారకము మానవుల కెపుడు

నడక హానికారకము మానవుల కెపుడు
కాదు ,నడక కలుగ జేయు గాయమునకు
మంచి యారోగ్య మటులనె  నంచిత మగు
బుధ్ది కుశలత యేర్పడు బుణ్య పురుష !