Saturday, June 3, 2017

ఆశ్రయ మునొసంగి తా నిరాశ్రయు డ య్యెన్

మిశ్రా యనునొక సాధువు
వి శ్రాంతికి  వచ్చినట్టి  విద్యార్థులకు
న్నేశ్రమ లేకుండగ దను
నా శ్రయ మునొసంగి తా నిరాశ్రయు డ య్యెన్

Friday, June 2, 2017

అంశము - కైకేయి వ్యక్తిత్వము నిషిద్ధాక్షరములు - ఎ, ఏ, ఐ అను అచ్చులు, ఈ అచ్చులతో కూడిన హల్లులు.

భరతుని గనిన నోయమ్మ !భవ్య చరిత !
రామ చంద్రుని గొడుకుగా మమత లొసఁగి 
చూచి లాలించి తివిగద సొబగు మీర
పంపు చుంటివి యడవికి పాడి యగున ?

పదునారురోజు పండుగ

పదునారురోజు పండుగ
నదరంగాజరుపుకొనిన నశ్వనిరఘుకిన్
 సదయనుజెప్పుమయాశిషు
లదనున్మరిజూచినీవ యార్యా శర్వా!

Thursday, June 1, 2017

బిడ్డలుపుట్టిరిద్దరట పేడికి జూచి జనమ్ము మెచ్చగా

దొడ్డమనస్సుతోడ రఘు దూరపు బంధువు పేడిరూపునిన్
 బిడ్డగ దామదిన్దలచి పెద్దమనంబున జేయవైద్యమున్
 బిడ్డలుపుట్టిరిద్దరట పేడికి జూచి జనమ్ము మెచ్చగా
లడ్డులుబంచిపెట్టిరట లైకులుగొట్టిన వారికప్పుడున్

రాజేశ్వరీ దేవి

యముని నోడించి వచ్చిన యక్క !నీకు
సకల శుభములు గలిగించు శంకరుండు
పూర్తి యారోగ్య మాయువు భువిని నిచ్చి
కంటి కినిరెప్ప  యట్లయి కాచు గాత !

బిడ్డ లిద్దఱు పుట్టిరి పేడి వలన

పెండ్లి యైనట్టి మూడేండ్లు వీడకుండ
బిడ్డ లిద్దఱు పుట్టిరి, పేడి  వలన
పుత్రు లేనాటి కెవరికి బుట్ట రార్య !
వాని జన్మము వ్యర్ధము, బరువు భువికి

అమ్మ యటంచు నిందుధరుడద్రితనూజనుబిల్చె మక్కువన్

అమ్మలగన్నయమ్మ గుట నాదిపరాత్పరియౌట కావుత
న్నమ్మయటంచు నిందుధరుడద్రితనూజనుబిల్చె మక్కువ
న్నిమహి నెంచు చూడగను నీమెకు సాటియ లేరుగానెట
న్నమ్మహితాత్మ నెప్పుడును హర్షముతోడన బ్రస్తుతించెదన్