Wednesday, December 5, 2018

త్రాగినమానవులుధన్యతన్గాంతురిలన్

తూగుచువాగుచునుందురు
త్రాగినమానవులు,ధన్యతన్గాంతురిలన్
నాగమవిధినర్చించిన
నాగీతాకారునెపుడునధికపుభక్తిన్

పసివాని

పసివానినగవుబోలును
రసమయకావ్యము,జనులవిరక్తులజేయున్
రసహీనకవితలన్నియు
మసనపువైరాగ్యపగిదిమదికిన్బోకన్

Monday, December 3, 2018

రమ్మనుచు

క్షత్రియతిలకా!మామకు
పుత్రా!
 రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్
సత్రములోపల జరుగును
మిత్రుడుమనసాంబశివునిపెండ్లియెసుమ్మీ

Sunday, December 2, 2018

జింగల

జింగ్లావ్రాసెనుగధలను
నాంగ్లంబున,వ్రాసెబోతనార్యుండుకృతిన్
నాంగ్లులుమెచ్చగ దానిని
బంగ్లాకవియనువదించెభాగవతమ్మున్

Saturday, December 1, 2018

భయమున

భయమునబాఱదేమదనపల్లెప్రజాళివధానమన్నచో
భయమునుబొందదెన్నటికిబాఱదుచూడుడుమీరలందఱున్
రయమునవచ్చిచేరుదురురండనిబిల్తురురానివారలన్
భయమనుశంకకూడదుసభాస్ధలియంతయునిండువారిచే

వధానమనమదనపల్లెప్రజలకుభయమౌ

మిధిలానగరపుబాలుడు
కధలనుగాదాజెప్పెనిటులగారవమొప్పన్
నవధానవిధినిజెప్పి,య
వధానమనమదనపల్లెప్రజలకుభయమౌ

వినయ్ ---శైలుల వివాహమహోత్సవశుభాకాంక్షలు

వినయ్ ---శైలుల వివాహమహోత్సవశుభాకాంక్షలు
----------?---------------?----------
చిరంజీవి వినయ్ !

తల్లిదండ్రులకేకైకతనయుడుగను
బుట్టినటువంటియోసత్య!పుణ్యపురుష!
సకలసద్గుణరాశి విసత్యమదియ
సందియంబిసుమంతయునిందులేదు

వరుడుపుట్టెపఠానేనివంశమందు
వధువుబుట్టెనువాడ్రేవువంగడమున
సత్యనారాయణాఖ్యగసాయిలతగ
బేర్లువడసిరిముచ్చటగొలిపెసుమ్ము

కంటి కింపగు కళ్యాణ మంటపమున
హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి
శుభ సుఖంబుల జీవన శోభ నంద
దీవెనల నీయ మీ జంట దీప్తినందు.

కలకాలము మీ రిద్దరు
కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులుగా కష్టం
బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.

ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.

సరిలేని శుభ సుఖంబుల
సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు
స్థిర దాంపత్యముతో మీ
రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్.

అమ్మా !  శైలు!

అత్త మామలు మఱి యును  నాడు బిడ్డ
లరయ  మంచి వా  రలు మఱి  యబల ! నీవు
వారి కనుసన్న మెలగంగ  వలయు నమ్మ !
అట్లు జేసిన  సంతోష మమ్మ ! మిగుల

తనర యీ సత్యయేనీకు తగిన భర్త
యెదురు చెప్పక వానికి  నెపుడు నీవు
పాలు నీ రును  బోలుచు  బ్రదుకు చుండి
మంచి గృహిణిగ  బేరొం దు  మనుజు లందు

మాన వత్త్వంబు తోడన మసలు కొనుచు
మానినుల యందగుచు  దల  మానికముగ
పిల్ల పాపల తోడన  చల్ల గాను
నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున

సకల శుభములు గలిగించు శంకరుండు
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .