Thursday, April 4, 2019

టజిఞుఃౌ

తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము"
తల్లిదండ్రులు గురువులు దనరుమనకు
దైవ సములార్య!వారిని దగువి ధముగ
సత్క రించగ వలయును సాదరమున
తిండి వెట్టుట మనవిధితెలిసి కొనుము

చజనుక్షుఔక్ష

ఎల్లరు దాదలంచవలెనిద్ధరబాధ్యతయెప్పుడైనను
న్దల్లికిదిండిపెట్టుట,వృధాయనిచెప్పును ధర్మశాస్త్రముల్
తల్లికిదిండిలేకయునుదద్దయుబాధకులోనుజేయుచో
నల్లదెవానిజీవనమునల్పునిగంటెనుహీనమౌసుమా
ప్రత్యుత్త

Wednesday, April 3, 2019

చశూక్ష

కరుముఖుడ!బ్ధినందనకుకన్నకుమారుడనంగుడన్నయు
న్బరగునుగాదెజూడగనుబంధముగాసరివోవునెప్పుడున్
నరయననంగుడేగద యయాచితబాణమువేయగానటన్
నిరవుగభస్మమాయెనటయీశునిగంటికితాళజాలకే

ruom



విఘ్న నాథుగభువి బేరువడసెనుగ
గరిముఖుండు,లక్ష్మికన్నకొడుకు
చెఱకువిల్లుదాల్చి శివునిమూర్కొనినయా
మకరకేతనుండుమన్మధుండు

Tuesday, April 2, 2019

చజిఞీమశ

వాక్చాతుర్యంబొకకళ
దృక్చాతుర్యంబునకదిదోహదమిచ్చున్
వాక్చాతుర్యపుశూన్యుడు
వాక్చాతురిజూపి మంత్రి వ్యర్ధుండయ్యెన్ 

Monday, April 1, 2019

చఝఞీఃక్ష

దండమయా విశ్వంభర!
దండమయా నీకునెపుడు దండముకృష్ణా!
దుండగులనిడుమలికలే
కుండంజేయంగనొప్పు గుంభిని నెల్లన్

చజీఞీఃృ

జగతిన్బాలకుడైనయాప్రభువు వంశాగ్రంబునూదన్దగన్
నగముల్శీర్షములూచిమెచ్చుకొనియెన్ నాదక్రియామాధురిన్
నగజామాతయుసంతసంబగుచు నాహ్లాదంబుతోడన్ శివున్
సగభాగంబును జేరెనత్తఱిని నాశాజ్యోతివెల్గొందెనాన్