Tuesday, May 14, 2019

టదీనుమ

మాడుగుల!గురువుపలుకులు
గాడిదకాల్పట్టమోక్షగతిలభ్యమగున్
వీడకపట్టుమునీవును
గాడిదపాదాలనిపుడగలుగునుశమమున్ 

షర్రులు



అర్రులుసాచుచున్మిగులనాఱడివెట్టుచునుండగాదమిన్
జర్రునసాంబమూర్తిగనిసాదరమొప్పగబ్రాణమీయగా
బుర్రెలుమాటలాడెదమపూర్వపురీతిసజీవులోయనన్
బుర్రెలుమాటలాడుటనుబూర్తిగగల్కిమహాత్మ్యమేసుమా

చడణంక్ష

అఱ్రులుసాచుచుశంకరు
జర్రునబ్రాణంబులీయసాదరమొప్పన్
వెర్రివీసంతసమొందుచు
పుర్రెలవియమాటలాడెబూర్వపురీతిన్

Sunday, May 12, 2019

దేవుడే

ఉండదెక్కడగ్రామముపుడమినరయ
దేవుడేలేని,గుడికడుదివ్యమయ్యె
భక్తజనములరాకతోబ్రభవమొంది
మూడురెట్లగువృద్ధితోబుంజుకొనుచు

పారావారము

పారావారముదాటగ
నీరాళ్ళనుదోడజేయనింపుగదారిన్
మీరందరుశిలలనుమన
సారాతెమ్మనెనురామచంద్రుడుహనుమన్

Wednesday, May 8, 2019

eykn



ఆరయసబబేజగతిని
దారాసంగమము,మిగులదౌష్ష్యముసుమ్మీ
కూరిమిపరకాంతలదరి
జేరుచునిజభార్యకడకుచేరకయుంటన్

ఆరయభావ్యమేయగునునార్యులుగూడనుగోరుకొందురే
దారనుసంగమించుటయె,దౌష్ష్యమగున్ గృహమేధి కెప్పుడున్
గూరిమిగల్గుచున్సతముకోరుటదేహపువాంఛనున్మదిన్ ,
మీరకహద్దునెప్పుడునుమేళములాడకయుంటలెస్సగున్ 

కుంజర

అంజనవింటివేయిదియయార్యులుసెప్పిరినిశ్చయంబుగ
న్గుంజరయూధమొక్కటిగగూడియుజొచ్చెనుదోమకుత్తుక
న్గుంజరయూధమా?యకటకూరిమిదూరుటదోమకుత్తుక
న్రంజిలజేయునేవినగరాగలభావితరంబులన్దగన్