Thursday, December 5, 2019

బ్రతుకిది

అతుకులబొంతయాయెనుగనారమపాలనమానవాళికిన్
పతియనగౌరవంబుమగవారికిలేకనువింతపద్ధతే
సతతముసేవజేయుచునుసజ్జనువోలెనునుండగోరినన్
బ్రతుకిదిరాాాాామరాాాజ్యమునభద్రతకోల్పడెదుర్భరంబుగన్ 

రామరాజ్యానబ్రతుకుదుర్భరముగాాాాదె

ప్రజలుహాయిగ జీవించెభరణియందు
రామరాజ్యాన,బ్రతుకుదుర్భరముగాదె
వలయురూకలులేనిచోబ్రజలకకట
రామరాజ్యముమనకింకరాదుతలప

Tuesday, December 3, 2019

కవి నాాలుగుపాాాదాాలఆదిని భాారతాాాార్ధము

కవిదలు మానుట యొప్పగు
గవిదలునేజేయునెడలకౌరవశతమున్
గవిదలలోమరణింతురు
కవితిక్కనవ్రాసెనటులకవివరులారా!

Monday, December 2, 2019

సానినిముద్దుపెట్టుకొనె సంయమిసద్గతిబొందగోరుచున్

పానముజేయుటన్ సురనుమానసరోగిగమారగాఖురా
సానినిముద్దుపెట్టుకొనె సంయమిసద్గతిబొందగోరుచున్
బానముజేయునాతడిలభ్రష్టుడు,మూర్ఖుడు,త్రాగుబోతునై
గానడుమన్నుమిన్నునికకాంతలజోలికిబోవుచుండునే

సానిన్ ముద్దాడెయోగిసద్గతిబొందన్

పానముజేయుతమద్యము
మానసమేవికలమగుచుమందుడెయగుచున్
మేనునుదాకుచునాాాదొర
సానిన్ ముద్దాడెయోగి సద్గతిబొందన్

Sunday, December 1, 2019

కుండనుగొండసొచ్చెనిదిగోకనులారగజూచినమ్ముమా

మొండిగవాదులాడకను మోమునుద్రిప్పకచూడుమాయిటన్
కుండనుగొండసొచ్చెనిదిగోకనులారగజూచినమ్ముమా
కుండనునీళ్ళుపోసి యికకొండకుదగ్గరగాగనుంచుచో
గండరగండడా!వినుముగానగవచ్చునుగొండనందులో

కుండలోనజొచ్చె గొండ గనుడు

కుండలోన నీరునిండబోసితనదు
కూతుబిల్చి చూడు కొండనిందు
కుండలోనజొచ్చె గొండ గనుడుతేరి
పార,గాననగునుస్పష్పముగను