Tuesday, February 4, 2020

తిండిమానగనాకలిదీరిపోయె

ఒడలుదగ్గెనుజక్కగ నుమకుచూడు
తిండిమానగ, నాకలిదీరిపోయె
కమలతిట్టినదిట్లకు కడుపునిండి
చాలుచాలింక మీతోటిసహగమనము

క్కలుసేవింపుడటంచుగణ్యతగనెన్ గాంధీమహాత్ముండిలన్

కలగానయ్యెనునాకుసామియిదియక్కాలంపుదగ్గట్టెయ
క్కలుసేవింపుడటంచుగణ్యతగనెన్ గాంధీమహాత్ముండిలన్
కలు నాయర్ధముజూడగానగుటముఖ్యంబయ్యెగాగల్లుగా
బలవంతంబుగద్రాగువారలికనేవారుండుమానండుసూ

Monday, February 3, 2020

కలుసేవింపుడనిగాంధిగణ్యుండయ్యెన్

పిలకలబోలుపెసరమొల
కలుసేవింపుడనిగాంధిగణ్యుండయ్యెన్
గలిబొలిమాటలెయనకను
లలనలుబాటించునెడలలబ్ధులుగలుగున్

Sunday, February 2, 2020

పిలిచిరిపెండ్లిచూపులకువేడుకమీఱ,శ్మశానభూమికిన్

తెలియనివారలైన,ననుతేజునిజెంతనునుండగోరియే
పిలిచిరిపెండ్లిచూపులకువేడుకమీఱ,శ్మశానభూమికిన్
వలదుర యేగకెన్నడునుబంగరుగట్టునువింటిగాదగ
న్నలరిన శంకరుండచటయార్తినిదాపసవృత్తినుండుటన్ 

పెండ్లిచూపులకుందగుబ్రేతభూమి

ప్రేతభూమినినివసించుబీదవారి
పెండ్లిచూపులకుందగుబ్రేతభూమి
ప్రేతభూమినినొకచోటవేదికగను
జేసిచూపులుజరిపింత్రు వాసిగాను

Saturday, February 1, 2020

తోడ్పడలేదుపార్ధునకుదోచినరీతినిగృష్ణుడెప్పుడున్ 

తోడ్పడలేదుపార్ధునకుదోచినరీతినిగృష్ణుడెప్పుడున్
దోడ్పడలేద!మీకెఱికె? తోడ్పడకుండినయుద్ధభూమిలో
నేడ్పులువచ్చెగారణమునేలికలందఱికన్నుమూతలే
తోడ్పడెగాదెపార్ధునకుతొయ్యలిద్రౌపదిచెల్లికావుతన్

దోడ్పడడర్జునునకు హరిదోచినరీతిన్

తోడ్పాటనునదియుండగ
దోడ్పడడర్జునునకు హరిదోచినరీతిన్
దోడ్పడలేదనియన,కై
మోడ్పులనేనిడుదుసామి!మౌనముతోడన్