Saturday, February 8, 2020

అన్నను బెండ్లియాడెనుమహామహితాత్ములుమెచ్చగాభువిన్ 

చెన్నగురూపమున్గలిగిశీతమయూఖునిబోలునట్టిరా
మన్ననుబెండ్లియాడెనుమహామహితాత్ములుమెచ్చగాభువిన్
నన్నువతోడగన్పడెడునామిధిలాపురముద్దుబిడ్డకా
యున్నతపూరుషుండునుమహోన్నతశీలుడునయ్యెభర్తగా

Friday, February 7, 2020

అన్ననుబెండ్లాడెనుమహితాత్ములుమెచ్చన్

చెన్నగురూపపుకుజరా
మన్ననుబెండ్లాడెనుమహితాత్ములుమెచ్చన్
మిన్నునుమన్నునుముదమున
సన్నుతిగైదండలిడుచుస్రజములువిసిరెన్

బంగారమ్మునుపేదపంచెసుఖసౌభాగ్యములంబొందగన్ 

రంగా!కంటివె?నెయ్యమొప్పగదగన్ రమ్యంపునెయ్యంబనే
బంగారమ్మునుపేదపంచెసుఖసౌభాగ్యములంబొందగన్
సింగారించగలేరుబీదలుసుమా,శ్రీమంతులౌవారలే
సింగారించగనర్హులౌదురుభువిన్ చిందించబంగారమున్

Thursday, February 6, 2020

బంగారమునునిరుపేద,పంచెజనులకున్ 

సింగారించగలేడిల
బంగారమునునిరుపేద,పంచెజనులకున్
రంగడురేషనుకార్డులు
ముంగిటముంగిటకునేగిమోదముతోడన్

దుష్టులుశిష్టులౌటగని,దుఃఖముబొందెరెల్లమానవుల్

తుష్టినిబొందెరందఱునుదుఃఖములన్నియుదీరెనంచుగా
దుష్టులుశిష్టులౌటగని,దుఃఖముబొందెరెల్లమానవుల్
శిష్టులుదుష్టులైమనినచెప్పగలేమనియీతిబాధలన్
దుష్టులదూరముంచవలెదుర్జనులౌటనుశిష్టరక్షకై

Wednesday, February 5, 2020

దుష్టులు శిష్టులుగమార,దుఃఖింత్రుజనుల్

తుష్టినిబొందుదురందఱు
దుష్టులు శిష్టులుగమార,దుఃఖింత్రుజనుల్
దుష్టులుశిష్టులెయగునెడ
కష్టములొకదానివెంటకలుగునువరుసన్

Tuesday, February 4, 2020

దిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్

బొండమువోలెనౌతనువు పూర్తిగదగ్గెనుసాంబమూర్తికిన్
దిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్
బండటిపిల్లవానిగనిపార్వతిసంతసమొందుచుండుటన్
తిండినిమానుచోమనకుతీరనినష్టముగల్గునేగదా