Friday, December 4, 2020

నోడినవాడుగెల్చె మఱియోడెనుగెల్చినాడుచిత్రమే

చూడగనేటుయోటునిక జూపరులందరిమానసంబునన్
వీడనియద్భుతంబులవి వేమఱుగుర్తుకువచ్చుచుండెనా
వాడునువీడునంచనక పెద్దమనంబున గెల్పునిచ్చుటన్
నోడినవాడుగెల్చె మఱియోడెనుగెల్చినాడుచిత్రమే


గెలిచినవాడోడెనోడిగెలిచెనొకండున్

 

కలకాలమొకేరీతిగ
గలిబొలిపలుకులగుచునుప కారములేమిన్
పలువురుమదిభావించగ
గెలిచినవాడోడెనోడిగెలిచెనొకండున్


Thursday, December 3, 2020

దినకరుడుద్భవించి నలుదిక్కులనింపెను,చిమ్మచీకటిన్

 ఘనమగు సూర్యతేజమును గాసిలిబెట్టగలోకమంతకున్

దినకరుడుద్భవించి నలుదిక్కులనింపెను,చిమ్మచీకటిన్

దినకరుడస్తమించగను దేజములేకనునింపెనాయెడన్

దినకరుడేగదా భువికిదీప్తిని,జీవనమిచ్చురత్నమౌ

దినకరుడుదయించిదెసల,దిమిరమునింపెన్

 అనయము గాంతిని నింపును

దినకరుడుదయించిదెసల,దిమిరమునింపెన్

దినకరుడేగిపడమరకు

దినకరుడేమూలమార్య!దివికిన్భువికిన్

Wednesday, December 2, 2020

జన్మదినోత్సవమ్మును శ్శశానమునంజరుపంగయుక్తమౌ

 చిన్మయరూపుడౌ శివుడుసేదనునొందుచువల్లకాడునన్

దున్మెను బాపులందరిని దోరపువాడిన శూలధారియై

సన్మతినానతీయుడిట సజ్జనులౌదగువారలెయ్యెడన్

జన్మదినోత్సవమ్మును శ్శశానమునంజరుపంగయుక్తమౌ

జన్మదినోత్సవముశ్శశానమునదగున్

 చిన్మయుడగు నాశివునకు

జననముమరణంబులనుటసబబేయార్యా!

తన్మయతగలుగునెడలను

జన్మదినోత్సవముశ్శశానమునదగున్ 

Tuesday, December 1, 2020

శివపూజనుజేయకున్న శ్రీహరియలుగున్

 శివశివ యేమని యంటిరి

శివపూజనుజేయకున్న శ్రీహరియలుగున్ ?
శివుడునుహరియునునొకరని
యవగతమేయైనయెడల యలుగుటయెటులౌ