ముచ్చట గొల్పునాసతిని మూఁడగు కన్నులు గల్గువానికిన్
బచ్చగనుండు గద్దెపయి పాణికి పాణిని గల్పఁజేయగా
వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁజూడఁగ పుత్రులెల్లరున్
జెచ్చెర దేవలోకమును జిన్మయ మూర్తులఁజూడ వచ్చెనే
Thursday, March 12, 2026
ముచ్చట.....
నీరుచాలక.....
పంట పొలములు పూర్తిగాఁబండిపోయె
నీరు చాలక,దీపమ్ము లారిపోయయెఁ
బెద్ద గాలులు వీచుచుఁ బిడుగు పడఁగ
నెపుఁడు వచ్చునో దీపాలు సెప్పలేము
నీరము లేకాదీపములు
సారము గల్గియున్ బుడమి సాలుల వెంబడి గట్టియాయెనే
నీరములేక,దీపములు నిల్చివెలుంగకయారెఁజూడుమా
జోరుగ వర్షముల్ గురియ చూరులనుండియు ధారకారగాఁ
దోరపు చెమ్మయుండుటన దూలము ప్రక్కన తీగలూడగన్
Wednesday, March 11, 2026
హీనుడే
దాన ధర్మ ముల్ నిరతముఁ దానుజేయ
సంతసం బొంద మిత్రులు సాదరమునఁ
జేయి చేతులు గలుపంగఁ జేరు గర్వ
హీనుఁడే లోకమున గౌరవించఁబడును”
Sunday, February 15, 2026
పదవీ విరమణ శుభాకాంక్షలు
పదవీ విరమణ శుభాకాంక్షలు
----------=======---==
వాసి గాంచు పఠనేని వంశమందు
పుట్టి తివి తల్లి దండ్రుల పుణ్య మలర
విద్య లందించు గురువుగా వినుతి కెక్కి
పదవి విరమించు శేఖర! ప్రస్తుతింతు
పదవిని నుండగ దెలియును
పదవీ విరమణము , గొప్ప వరమగును గదా
పదవీ విరమణ జనులకు
పదికిం బది మార్లు శివుని బ్రార్ధన జేయన్
పదవిని నుండగ జేయము
సదయుండగు శివుని బూజ సాకారముగన్
పదవులు దొలగిన జేతుము
పదవీ విరమణము గొప్ప వరమగును గదా .
ఎంద రెందరికో విద్యనంద జేసి
యోగ్యులుగ తీర్చి దిద్దిన యోధ వగుచు
స్ఫూర్తినిచ్చిన సౌజన్య మూర్తి వీవు
సాటి యెవరును లేరు నీ సాటి వారు
నవ్వు చిందించు మోముతో నమ్రుడవయి
సత్య మార్గమే ప్రగతికి నిత్యమనుచు
నీతి నియమాలు దప్పక నిర్మలముగ
సేవ లందించితివిగద చేవ జూపి
తడబడని నడక నేర్పుచు
నడుగడుగున వెలుగులనిడు నాదిత్యుడవై
గడిపితివి గతము నంతయు
బడిపిల్లల మద్య నీవు భాసుర లీలన్
సకల శుభములు గలిగించు శంకరుండు
నాయురారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని ఱెప్ప యట్లయి కాచుగాత !
యెల్ల వేళల మిమ్ముల జల్ల గాను
ఆశీస్సులతో .......
పోచిరాజు సుబ్బారావు
Saturday, November 22, 2025
Sankatsm
Wednesday, April 2, 2025
విశ్వావసు నామ సంవత్సరము
విశ్వావసు యుగాది:
ఓ విశ్వావసు నామ వత్సరమ పౌరోద్యోగ సంధాత్రివై
భావోద్రేక వినాశకారిణివి నై భద్రార్థ సంరంభివై
దైవానుగ్రహ పాత్రులై జనులు నిత్యంబుండు నట్లింపుగా
వే వీక్షింపుమ శాంతి సౌఖ్యము లిలం బెంపొంద నిమ్మా దయన్
విశ్వక్షేమ రతాంతరంగ వికసద్విశ్వావసూత్తుంగ నా
మైశ్వర్యప్రమ దాయు రుచ్చతమ విద్యా కార్య సంధాయకీ
శశ్వల్లోక జనౌఘ వర్ధన సు రక్షాదక్ష విఖ్యాత మ
మ్మాశ్వాసింప దయార్ద్ర చిత్త వయి రమ్మా వర్ష వర్గాగ్రణీ
అలసిరి జనులీ క్రోధిని
నల పొసఁగక సుఖ మొసంగ నందఱి కిలలోఁ
జెలువము మీఱఁగ వత్సర
లలామ విశ్వావసు వెస వ్రాలుమ జగతిన్
