మఱువకు మానవ సేవను
మరువకు నీ బంధు జనుల మరువకు శి వునిన్
మరువకు నీ కర్తవ్యము
మరువకు నీ మాతృసేవ మహిలో నరుడా !
Sunday, February 28, 2010
బాబా !
బాబాని కోరినంత నె
బాబాయే వేగ వచ్చి బాధలు తీ ర్చున్
బాబా కది సంతోషము
బాబా మా ప్రా ణ మౌట భాగ్యము మాదే .
బాబాయే వేగ వచ్చి బాధలు తీ ర్చున్
బాబా కది సంతోషము
బాబా మా ప్రా ణ మౌట భాగ్యము మాదే .
వడ్ల గింజ
నిండార పంట చేలను
పండారిన వడ్ల గింజ పండుగ చేయన్
కండ్లార చూ సి గింజను
పండారిన ద య్యె మనసు పరిపరి విధమున్ .
పండారిన వడ్ల గింజ పండుగ చేయన్
కండ్లార చూ సి గింజను
పండారిన ద య్యె మనసు పరిపరి విధమున్ .
చిట పటలాడు
చిటపట లాడుట మానుము
చిటపటలే క్రుంగ దీయు మేటిని నైనన్
చిటపటల వల్ల మనుజులు
జటిలముగా మారుచుంద్రు జగముల నెల్లన్ .
చిటపటలే క్రుంగ దీయు మేటిని నైనన్
చిటపటల వల్ల మనుజులు
జటిలముగా మారుచుంద్రు జగముల నెల్లన్ .
Friday, February 26, 2010
గో వర్ధన గిరి
గోవర్ధన గిరి ఎత్తియు
గోవుల కాపాడినావు గోకుల కృష్ణా !
గోవనితలు గోపాలురు
గోవిందుని జేర వచ్చె గోగిరి దరికిన్ .
గోవుల కాపాడినావు గోకుల కృష్ణా !
గోవనితలు గోపాలురు
గోవిందుని జేర వచ్చె గోగిరి దరికిన్ .
సాదర వందనాలు
వంశ మెన్న గ చాగంటి వంశ తిలక !
కోట +ఈ శ్వర కలిపిన కుదిరె పే రు
రావు అనునది నీ పేర చివర గలదు
అందుకోవయ్య ! సాదర వందనాలు .
కోట +ఈ శ్వర కలిపిన కుదిరె పే రు
రావు అనునది నీ పేర చివర గలదు
అందుకోవయ్య ! సాదర వందనాలు .
సుందర కాండ
కాండల నన్నిట మెరుగగు
కాండము మఱి సుందరండ్రు కావ్యజ్ఞులిలన్
పండుగ రోజున చదివిన
మెండుగ యా హనుమ యిచ్చు మిత్తిని లేమిన్ .
కాండము మఱి సుందరండ్రు కావ్యజ్ఞులిలన్
పండుగ రోజున చదివిన
మెండుగ యా హనుమ యిచ్చు మిత్తిని లేమిన్ .
Subscribe to:
Posts (Atom)
