Friday, May 7, 2010

హరి విల్లు-----షష్టి పూర్తీ

పూ జ్యులు పేరరాజు -సత్య సుందరులు
ఆ పురాణ దంపతుల జ్యేష్ట పుత్రుడ !
నాన్న ఓ నాన్న
సామాన్య కుటుంబాన జన్మించి
తెనుగు పండిట్టువై
వేల సంఖ్యల శి ష్యుల మన్ననల నందినావు
మేమునూ నీ శిష్య పరమా ణు లమే
అయినందులకు గర్వించు చున్నాము
అమ్మా ! నాన్న !
ఆది దంపతులు మాకు మీరు
మీ కనుసన్నల మెలగు చుంటిమి
మీ ఆజ్నలే మాకు శి రోదార్యములు
షష్టి .....షష్టి పూర్తి
నిండెనా అరువది వత్సరములు
కలగా ఉన్నది నాన్న !
నీ వయసును చూ స్తే
పవలు రేలు శ్ర మించినా
అలుపు సొలుపులు నిన్ను అంటవు
ఏ మి కోరవు ఏ మి వేడవు
నీవు మా పుణ్యాల పంటవు
మా కోసమె నీ జీవితమంతా
ధార వోసితివి, ఇది నిజము సుమ్ము
నీకుగా నీకు ఏమియు లేదు
నిరాడంబర జీవితము తక్క
బ్రతుకు నందలి మిట్ట పల్లము
లన్నియు నీకు సమానములే
దుఖమునకు క్రుంగి పోవుట
సుఖమునకు పొంగి పోవుటలు
నీకు సుదూరములు........
ఎంత ఎత్తుకు ఎదిగినా
ఎత్తు లేవీ లేనివాడవు
దైవ చింతన దైవ దర్శనములు
నీకు నిత్య కృత్యములు
ఈ షష్టి పూర్తి పర్వ దినాన
మా నమస్కృతు లందు కోవలె
శత వసంతము లీవు మనవలె
మీకివే మా శత కోటి వందనములు ...
ప్రేమతో ....
కిరణ్
పాపాయి
మాధవి

Sunday, March 28, 2010

శ తక సమర్పణ

సీతా రాముల కరుణన
శ తకమ్మును వ్రాసి యుంటి శ తకము పేరున్
సతతము నరుడా యన న
ప్పొత్తము నర్పింతునమ్మ ! పుణ్యము కలుగన్

వ్రాసితి శంకరు గరుణన
వ్రాసితి మఱి రామ భక్త శతకము నేనున్
దోసిలి నొగ్గియు సతతము
నాశ తొ నర్పించు కొందు నాన్నకు ప్రీతిన్ .

Sunday, March 21, 2010

రధ సప్తమి స్నాన శ్లో కము

యద్యజ్జన్మ కృ తం పాపం
మయా సప్తసు జన్మసు
తస్య రో గంచ శో కంచ
సమస్తం హంతు సప్త మీ .

Wednesday, March 17, 2010

౧౦ .వాయువులు

౧.ప్రాణము ౨.అపానము ౩.వ్యానము (వ్యామోహము )౪.ఉదానము (ప్రత్యుత్పత్తి )౫.సమానము ౬.నాగము (త్రేన్చుట)౭.కూర్మము (కాంతి )౮.క్రుకరము(ఆకలి మంట )౯.ధనంజయము (విశ్రాంతి )౧౦.దేవదత్తము (ఆవలింత ).

౭ వరల్డ్స్ ఆఫ్ ది వరల్డు

౧.చిచేనిజ -----మెక్సికో ౨.క్రీస్తు రెడిమేర్ -----------బ్రాసిల్ ౩.తాజ్ మహల్ --ఇండియా
౪.గ్రేటు వాల్ ఆఫ్ చీ నా ౫.కోలోజియం --ఇటలి. ౬.పేత్ర--జార్డాన్ .౭ .మాచు పిచ్చు --పెరూ.===========వీ టి గురించి వివరముగా తెలిసి కొనవలసి యున్నది.

Wednesday, March 10, 2010

బే స్మెంటు

బేస్మెంటు మంచిదయ్యెను
బే స్మెంటున నుండి మేము చూతుము టీ విన్
బే స్మెంటు లేని ఎడలన
భే షుగ్గా మాదు ఉనికి ప్ర శ్నార్ధకమౌ .

ఆరు నెలలుగ నుంటిని నమెరికా లొ
ఐన పది +రెండు రోజులు పైన నుంటి
మిగులు రోజులు బేస్మెంటు గాగ నయ్యి
వెడలె రోజులు మాకట్లు వింతగాను .

బే స్మెంటుకు వందనములు
బే స్మెంటే మాకు నిల్లు భే ష రతు గ గన్
బే స్మెంటు కొచ్చి పిల్లలు
భే షు గగా నాడిరపుడు భీతిని లేకన్ .

హీటరు చేసిన మేలును
నెట్టుల మరువంగ గలను నెప్పుడు నైనన్
అట్టిటు తిరుగుచు నుండియు
దట్టమమగు నుష్ణ మిచ్చి గట్టెక్కిం చెన్


Wednesday, March 3, 2010

లక్ష్మీ స్థానములు

౧.తామర పూవు
౨.మారేడు దళము
౩.ఏ నుగు కుంభ స్థలము
౪.ఆవు వెనక తట్టు
౫.ఆడవారి నుదురు