Saturday, August 31, 2013

పాదమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్

మీదకు రానేరడు గద
పాదమ్ములు  లేని నరుడు , పరుగిడ జొచ్చె
న్నీ దరి కాదరి కా తడు
వేదన మఱి  దాళ లేక వీ రడు  మిగులన్ 

దానిమ్మ

చూడు దానిమ్మ ఫలమును  చూడ్కు లలర
గింజ లుండెను  ము త్యపు  గింజ వోలె
తినుట మొదలిడ నోరంత  తీపి  గలిగి
మంచి రుచి నిచ్చు నయ్యది  ,మంచి  ఫలము 

Friday, August 30, 2013

కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను

నాదు  సోదరి గిరిజకు  నల్ల గాను
కొడుకు పుట్టె , సన్యాసికి గురువు కృపను
ముక్తి గలుగగ  జేరెను  మోక్ష పధము
గురువు దయలుండ  సాధించు  కొనగ  గలము 

తెలుగు పద్యము

తెలుగు పద్యపు  భావమ్ము  తీ యనగుచు
సంతసమ్మును  గలిగించు  జదు వరులకు
అందువలనతా  ననియెను  నాంధ్ర భోజు
డైన  రాయలు  మఱి లెస్స  యైన  దనియు
 

Thursday, August 29, 2013

సతి సతి గవయంగ సంతు గలిగె

కలుసుకొనిరి  విందు గలుగు చోటన  మఱి
సతి సతి  గవయంగ  సంతు గలిగె
భార్య మరియు  భర్త బహు దినంబులు నట
సహజ మీయది  యిక  జగము నందు
 

లోభి

తాను  దినడు  మఱి ని  దాచు సంపద మొత్త
మంత , పెట్ట డితర  మనుజు లకును
లోభి గుణ మదియ   లాభ మేమియు లేదు
వ్యర్ధ మతని  బ్రదుకు  వసుధ లోన 

Wednesday, August 28, 2013

భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు

ఇందు  సందేహ  మేలనో  నిదియ నిజము
భాగ్య నగరమ్ము  హైదరాబాదు, కాదు
అనిన నొప్పదు ముమ్మాటి కదియ సుమ్ము
కంది  శంకర ! నమ్ముడు  కల్ల కాదు .