Thursday, May 14, 2015

పద్య రచన -లడ్డులు

చిత్ర మందలి  లడ్డులు చిత్ర ! చూడు 
మెంత గుండ్రము  నుండె నో నంత రుచిని 
కలిగి యుండును నిజమది ,కావ లసిన 
తీసి కొని తిను మిక మఱి  తీయ గుండు 

కాకర కాయల రసమ్ము గడు మధుర మగున్

భీక రమౌ చే  దుగలుగు
కాకర కాయల రసమ్ము, గడు  మధుర మగున్
వ్యాకరణం  బె ఱి గినచో
నేకావ్యపు సారమైన నింపుగ మదికిన్


Tuesday, May 12, 2015

పద్య రచన -మారీచుని రాముడు సంహ రించుట

రక్కసు డా మా రీచుడు 
గ్రక్కున  మఱి  లేడి రూపు గలిగిన వాడై 
యక్కసు నం సీ  తనుగొన 
రక్కసునిం జంపు చుండె రాముడు  కనుడీ !

Monday, May 11, 2015

దొంగకు నమస్కరించిన దొరకు సిరులు

తగిన శిక్షను  వేయంగ దగును సుమ్ము
దొంగకు, నమస్కరించిన దొరకు సిరులు
సకల శుభములు  గలిగించు  శంక రునిల
నిజము  నామాట  నమ్ముడు నెలతు లార !

కాలికి ముల్లు గ్రుచ్చినది కావలె గొడ్డలి దాని తీ యగన్

బాలిక పోవు చుండ గను  బారము వెంబడి యంత లో  పలన్
కాలికి ముల్లు గ్రుచ్చినది, కావలె గొడ్డలి దాని తీ యగన్
కాలము దీరి నట్టి పెద కావలి చెట్టది నేలకూ లగా
మూలము లోనికిన్దనర మోడును బూ ర్తిగ గాల్చగా మఱిన్

పద్య రచన -గాజులు

చిత్ర మయ్యది జూడుము  చిత్ర ! నీవు 
రంగు రంగుల  గాజులు రమ్య మలరె 
చూచు  చుండిరి  భామలు చుట్టు గూడి 
వేసి కొనగను గాజులు  విడివి  డిగను 

Sunday, May 10, 2015

పద్య రచన -కంద - బొంద

భార్య నడుగగ గూరను  భర్త  య పుడు
వండు చుంటిని  గందను  వంట కముగ 
ప్రాస  కొరకునై బొందని పలుక భర్త 
విరుగ గొట్టెను జేతిని  కరుణ లేక