Wednesday, September 30, 2015

పద్య రచన -గురు శబ్ద వాచ్యు డెవ్వడు ......


గురు శబ్ద వాచ్యు డెవ్వడు
మరి తెలియదె మీకు సామి !మాన్యుడు గురువే
గురువే జ్ఞానము నిచ్చును
గురువను శబ్దమ్ము భువిని గురుతర మయ్యెన్ 

Tuesday, September 29, 2015

తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్

తారా పథమున మబ్బులు
తా రాడుచు నుండ మిగుల తమమున్గలుగ
న్బాఱి న  మబ్బుల దాగిన
తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్ 

పద్య రచన -ఇనుము సూదంటు రాయి ....

ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
మేన క సొగసు  జూచియు  మిగుల వగలు 
జెంది  యా గాధి తనయుడు  చేరి దనను 
భంగ మొనరింప  జేసెను  దనత  పసును

ఇనుము సూదంటు రాయికై  యెగయు నట్లు
భార్య పొందుకై తపియించు భర్త యెపుడు
క్రొత్త గాబెండ్లి  యగుటన  కోర్కె లుండు
సహజ మయ్యది  క్రొ త్త దౌ  జంట కిలను  

Monday, September 28, 2015

ఘటమున నేనుగుల గుంపు గలదు ముకుందా !


నట రాజు ప్రతిమ యుండెను 
ఘటమున, నేనుగుల గుంపు గలదు ముకుందా !
యటవీ ప్రాంతపు హద్దుల 
జటిలంబగు  మార్గమగుట జనశక్యంబే ?

పద్య రచన -చనుబాలు ద్రాగు బిడ్డడు ........

చను బాలు  ద్రాగు బిడ్డడు
ఘనమగు రక్కసుల జంపె గనుగొను చుండన్
వినయముగా నే జేతును
వన మందలి పూల దెచ్చి భక్తిని బూజన్ 

అష్టావధానము ప్రభావతి గారిచే

అవధానము లన్నిట మీ
యవధానమె  గొప్పదౌను నమ్మా ప్రాభా !
యవధానం బొ నరింపుమ
యవనిన్గల ప్రముఖ గణము హాహా యనగన్



పద్య రచన -----కవివర!నీ కవిత్వము ........

కవివర!నీ కవిత్వమునగాం తుము చక్కని సూక్తులెన్నియో
యువతకు  పట్టుకొమ్మలయియొప్పును  బాగుగ నుంట జేసి యే
యవ  గుణముల్ త్యజించియును  హాయిగ జీవన మార్గ మెంచగా
నవిరళ జీ వనంబును నయం బుగ జేయుచు హాయి గొల్పెడిన్