Thursday, March 31, 2016

రామచంద్రునినోడించెరావణుండు

సిరులనిచ్చునుదప్పకసేవజేయ
రామచంద్రుని,నోడించెరావణుండు
భీకరరణమునందునబేరుమోయు
కపులనెందరినోవరుసవరుసగను

రామచంద్రునినోడించెరావణుండు
ఎంతచక్కటియనృతమువింతగాదె?
రావణుండయోడించెనే?రామునకట!
నమ్మువారలులేరిట వమ్ముబలుక

Wednesday, March 30, 2016

పద్య రచన -గాన కోకిల సుశీల

గాన కోకిలవు సుశీల గైకొ నుమ! న
తులను ,నీదు గానమ్ము సం తోష బరచె
మమ్ము లనునెం త  యో ,కాన మనుగడ  సుఖ
మయము గావుత !శంకరు మహిమ వలన



Tuesday, March 29, 2016

పసి బాలుని బెండ్లి యాడె బ్రౌ ఢ ముదమునన్

కసుబుసు లాడకు మామా !
పసి బాలుని ,బెండ్లి యాడె బ్రౌ ఢ ముదమున
న్నిసుకంభట్ల కులంబున
మిసమిస లాడెడు రమణుని మెచ్చుచు మదిలోన్ 

దానగుణముమిగుల హీనగుణము

అన్నిగుణములందుమిన్నయేగాదయీ
దానగుణము,మిగుల హీనగుణము
పరులబాగుజూచిపవలునురేయిని
నెంతగానొమదినినీర్ష్యబడుట

Monday, March 28, 2016

పాపపుణ్యములాయవిభరణిలేవు

పాపపుణ్యములాయవిభరణిలేవు
లేవునిజమేయవికనిపించవెవరికిని
కానివాటిఫలితములుగనబడునిల
ననుభవించితీరవలయుననుదినమ్ము

ధర్మజునకు గన్న తల్లి ద్రౌపది యందున్

నిర్మల మనస్వి కుంతియ
ధర్మజునకు గన్న తల్లి, ద్రౌపది యందున్
వర్మా !ద్రుపదుని సుతనే
ధర్మ జుని న్బెండ్లి యాడి తనయుల గనియెన్ 

విధవయనబడుభర్తజీవించియుండ

భర్తమరణించినప్పుడుభార్యభువిని
విధవయనబడు,భర్తజీవించియుండ
యన్నిశుభకార్యములకునుహాజరగుట
పాలుపంచుకొనుటలునుబడయవచ్చు