Thursday, October 20, 2016

పతి ముఖ దర్శనము సేయ బార్వతి వెఱచున్

అతివకు బుణ్యము లొదవును
బ తి ముఖ దర్శనము సేయ, బార్వతి వెఱచు
న్స తతము మనసున దలచుచు
బతియగు నావేంక టేశు బాధల గమికిన్ 

చమత్కార పద్యాలు –వీరబ్రహ్మ స్మరణ

ఈశ్వ రాంశ సంభూతుడు నశ్వరుండు
వీర బ్రహ్మేంద్ర పేరున వెలయు నతడు
జరుగ బోవుసంఘటనల గురిచి పొత్త
మయ్యది  రచన జేసిన నామహుండు
కాచు నెప్పుడు మనలను గరుణ తోడ

స్తనములు లేని పూ రుషుడు సంస్తవ నీయుడు గాడు ధాత్రిలో

స్తనములు లేని పూ రుషుడు సంస్తవ నీయుడు గాడు ధాత్రిలో
వినగను నేహ్య భావము న వేమఱు మాటలు బల్క నేరనే
స్తనములు గల్గు పూరుషుని శాస్త్రము జెప్పు నపుంస కుండుగా
వినుముర చంద్ర శేఖర వివేక ముతోడ ను బల్కు మాయికన్ 

శంకరార్య !

తరచుపయనమగుటసరికాదుశంకర!
పయనమగుటవలనభద్రతయది
కానరాదుమనకుకనుచూపుమేరన
జరుగరానివియునుజరుగుచుండు


Wednesday, October 19, 2016

స్తనములు లేని పురుషుండు స్తవ నీ యుండే

వినుమా పురుషుల కుండవు
స్తనములు, లేని పురుషుండు స్తవ నీ యుండే
మనమున బెను దుర్బుధ్ధులు
వినయము గా నుండు నెడల బెరుగును సిరులున్ 

చమత్కార పద్యాలు – విశ్వకర్మ స్మరణ

నీరజాo బక భూతుడు నిర్మలుండు 
ఘనతర మణి భూషణములు గలుగు నతడు 
న గ్ర గోపుడు మహితుడు నాది గుణము 
లుగల విశ్వకర్మ మనలదగు వి  ధము గ 
కాచు గావుత నిరతము గరుణ తోడ 

Tuesday, October 18, 2016

ఆరోగ్యమె

ఆరోగ్యమె  మహ భాగ్యము
నా రోగ్యము  గలుగు నతడు  హాయిగ  నుండున్
న్నా రోగ్య వంతు నొ ద్దకు
నే రోగము  రాదు సామి ! యీ శుని  కృ ప చేన్ .