Friday, March 31, 2017

నారద ముని సత్తమునకు నలువురు భార్యల్

ఆరయ భక్తియు కలహము
నారాయణు గాన మదియ జ్ఞానము లవియే
యూరా యనునటు గలుగుత
నారద ముని సత్తమునకు నలువురు భార్యల్

Thursday, March 30, 2017

తనయుడె తండ్రికిన్ దలను దన్మయ మొందగ గీకె నవ్వుచున్

అనయము ద్రాగు చుండియు సహాయము జేయక దిర్గు చుండగా
తనయుడె  తండ్రికిన్ దలను దన్మయ మొందగ గీకె  నవ్వుచున్
వినుముర దండ్రు లెప్పుడు వివేకము తోడను మెల్గుచో మరిన్
దనయులు వారి కిత్తురు గ ధైర్యము , ద్రా గక నుండు మార్గమున్

తనయుడె తల గొఱిగి నాడు తండ్రికి సుమ్మీ

వినుమా  సోదర ! యియ్యది
తనయుడె  తల గొఱిగి నాడు తండ్రికి సుమ్మీ
వినుటను  జరిగినె  నిట్లుగ ?
మునుపెన్నడు గాని  నీకు  మోమిడి  చెపుమా !


Wednesday, March 29, 2017

గరుడుని చూచి నంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్ర మూర్తియై

ఇరవని జాటు మార్గమును నెంచుకు బోవుచు నుండగా నటన్
గరుడుని చూచి నంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్ర మూర్తియై
పరమ విరోధి దానగుట పాము భయంబును నొంది   యత్తఱి
న్న రయగ సాజమే గద వినమ్రతగాను జరించు టి ధ్ధరన్

గరుడుని హరి చూచి నంత గ్రక్కున మ్రొక్కెన్

ఇరవుగ  రమ్మని బిలిచెను
గరుడుని హరి చూచి నంత, గ్రక్కున మ్రొక్కెన్
గరుడుడు వచ్చుచు నతనికి
పరమాత్మా !వందనములు బాయకు  నన్నున్

Tuesday, March 28, 2017

శంకరార్య!

లలిత పదజాల ములతోడ లహరి వోలె
సాగె మీయది కవనమ్ము  శంకరార్య!
యేమి భాగ్యము మాయది యీపుడమిని
మీకు శిష్యుల మైతిమి మేము  మరిని

శుభాకాంక్షలు హేవిళంబి

క్రొత్త వ త్స రమ్ము  కోరి రాగంగను
బ్లా గు  కవుల కిత్తు  వందనములు
హేవిళంబి మీకు హితము నొసఁగు గాక !
వత్స రమ్ము పూర్తి వరకు  ధరను