Monday, July 31, 2017

కాంతకై త పింతురు వార్ధకమున మిగుల

కాంతకై త పింతురు వార్ధకమున మిగుల
యక్షరాల ని జముసామి !యామె లేని
యిల్లు కాంతివిహీనమై యుల్లమునకు
బాధ కలిగించు దప్పక భవ్య చరిత !

Sunday, July 30, 2017

శంకర శతకము

శంకరశతకపు పొత్తము
బింకముగా వ్రాసినట్టి పెద్దలకీయీ
లెంకను జేయుదు నతులను
శంకలు లేకుండగొనుడు సాదర మొప్పన్

Saturday, July 29, 2017

భక్ష్యముల నాముదము తోడ వండ దగును

భక్ష్యముల నాముదము తోడ వండ దగును
బలుకు మీయది  సత్యము, వండుదురట
నారి కేళపు తైలాన నాణ్యముగను
గొన్ని ప్రాంతాల యందున  మిన్నగాను

Friday, July 28, 2017

ముని గన్గొన ముదిత వలపు ముమ్మర మయ్యెన్

వినయపు నతులను నిత్తును
ముని గన్గొన, ముదిత వలపు ముమ్మర మయ్యెన్
గని నంతనె తన భర్తను
వనజా ! విను సహజ మదియ వనితల కెల్లన్

Wednesday, July 26, 2017

దత్తపది

జయమునుబలుకగసురలట
రయమునబాణంబువేయరాముడుమిగులన్
 భయమునబంగరుమృగమది
నయముగవేగంతుతోడ నర్తిలి పారెన్

Monday, July 24, 2017

ప్రేమయె పొంగి పొర్లినది వీధులలో జనులెల్ల జూడఁగన్

ప్రేమయె పొంగి పొర్లినది వీధులలో జనులెల్ల జూడఁగన్
గామము హెచ్చుగా గలుగ కామిని మానస మందునన్భళా
రాముని మందిరంబు గని రాముని వేడిరి సామి ! మమ్ముల
న్నేమిగ జేతురో యికను నిట్లుగ మేమిట కల్సుకొందుకై

Sunday, July 23, 2017

ఆగష్టు 15

ugust 10, 2015

ఆగష్టు 15

ఈ రోజే మన పండుగ
మీరందరు వచ్చిరిటకు మీరని భక్తిన్ 
గారవపు నతుల నిడుదును 
వీరుల మది దలచు చుండి వీడని భక్తిన్ 
ఆంగ్ల పాలకు లవశమై యష్ట కష్ట 
ములను  భరియించు బ్రజలకు ముక్తి కొరకు 
గాంధి  మొదలగు వారలు గలసి గట్టు 
తనము తోడన పోరాడి తనర దెచ్చె 
దేశ మునకు స్వరాజ్యము దేజరిలగ 
ఖైదు  లోపల మ్రగ్గియు కఠిన మైన 
దెబ్బ లెన్నియో భరియించి ,తెలివి పోయి 
బ్రతికి రార్యులు  జీ వ చ్ఛ వంబు వోలె 
చెప్ప  లేమయ్య  వారల చిప్ప కూడు 
అట్టి  మహితాత్ము  లగురిచి గట్టి గాను 
నెంత జెప్పిన మఱి యది  సుంతె  యగును
వంద నంబులు వారికి వంద లాది
చేయుటే మన  కర్తవ్య మార్య !యికను

భరత మాతకు పలుకుడు భవ్యు లార !
జైభ  రతమాత !యిక నీకు  జయము జయము
సేవ జేతును నిరతము శిరము  వంచి
దయను జూడుమా నాపైన ధాత్రి  జనని !

దేశ  మునకునై ప్రాణాలు దీ సికొనిన
నాయ  కులయాత్మ శాంతికై నలువ గురిచి
చేయ బ్రార్ధన నేనును  జేతు నార్య !
సెల  వొ  సంగుడు నాకిక  సేతు నతులు