Monday, November 27, 2017

గరములతోధనువునెత్తిగడగడవిరిచెన్

గిరిజాపతివిల్లునెగద
యిరవుగనారామభద్రుడెంతయొగరిమ
న్గరగరరవములుగలుగగ
గరములతోధనువునెత్తిగడగడవిరిచెన్

Sunday, November 26, 2017

శంకరుడెత్తెవెండిమలశైలతనూభవసంభ్రమింపగన్

శంకరుడెత్తెవెండిమలశైలతనూభవసంభ్రమింపగన్
శంకరువాసమేయదిగశంకరుకొండనునెత్తుటెట్లగున్
 బొంకములేనిమాటలనుబూరగవీలగునేదయాకరా!
శంకరుడెత్తగాగిరినిశైలతనూభవసంతసించునే?

Saturday, November 25, 2017

శంకరుడెత్తెహిమగిరినిసతివెరగందన్

వంకరటింకరమాటలు
వెంకడుదాబలుకుచుండివెటకారముగాన్
 లంకారాముడ!వినుమా
శంకరుడెత్తెహిమగిరినిసతివెరగందన్

తాతావారు

తాతావారినిగోరుదు
మాతావుకువచ్చియుండ్రి మమ్మలరింపన్
 బ్రీతిగనవధానమ్మును
జేతోమోదంబుగలుగజేయుడుమీరున్

Friday, November 24, 2017

యవధానముజేయువాడెయతిమూర్ఖుడగున్

అవధానమ్మదియొకకళ
యవధానముజేయునతడుహరితుల్యుండే
యవివేకపుపలుకులెయివి
యవధానముజేయువాడెయతిమూర్ఖుడగున్

Thursday, November 23, 2017

చోరునకున్సముండుకవిచోద్యముగాదిదినిత్యసత్యమే

చోరునకున్సముండుకవిచోద్యముగాదిదినిత్యసత్యమే
మీరలుబల్కుటిట్లుపుడుైమేదినినాయమెరాజశేఖరా!
చోరుడుజేయునేరచనసూటిగజెప్పుమనీదుమాటయు
న్నేరడుగాకనేరడిలనేస్తమ!యెయ్యెడజింతసేయగన్

చోరునిసముడుకవియనుటచోద్యమ్మౌనే?

వీ రయ్య పలికె నిట్లని
చోరునిసముడుకవియనుటచోద్యమ్మౌనే?
నారయచోద్యమ్మేగద
చోరునినిన్బోల్చదగునెసుకవులతోడన్