Wednesday, February 28, 2018

మసియొనర్చెను,శంకరున్ మన్మధుండు

పూలబాణుని ,గోపాన పురహరుండు
మసియొనర్చెను,శంకరున్ మన్మధుండు
విరహ వంతుని జేసెను వేసి శరము
నంగ హీనుని ధాటికి నాగ గలరె?

Tuesday, February 27, 2018

నిత్యముగావలెన్ మనకు నెమ్మదిగల్గ సమస్య మిత్రమా!

నిత్యముగావలెన్ మనకు నెమ్మదిగల్గ సమస్య మిత్రమా!
సత్య ము సామి!మీ పలుకు సైయని యందును నీదు మాటకు
న్భత్యము లేకపోయినను  బాధను నొందను గాని శంకరా!
నిత్యము లేనిచో నదియ నెమ్మది యుండదు నాదుబుర్రయున్

నిత్యము గావలెసమస్య నెమ్మదిగలుగ

సత్యము బలికితి రార్యులు
నిత్యము గావలెసమస్య నెమ్మదిగలుగ
న్నిత్యము శంకర గురుసాం
గత్యముతోనుండుకతనకవిగానైతిన్

Monday, February 26, 2018

న్బిన్నలుపెద్దలేగిరట భీష్ముని పెండ్లిని జూడవేడుక

అన్నగరాజుదాబిలువ హర్షముతోడన వేగిరంబుగ
న్బిన్నలుపెద్దలేగిరట భీష్ముని పెండ్లిని జూడవేడుక
న్నన్నువబార్వతీ పతికి నామెకు గానుకగానిడన్నతు
ల్బన్నుగ వారలిత్తురిక బ్రాభవ మొందగసంపదల్సుమా

వెడలి రెల్ల భీష్ము పెండ్లి జూడ

గిరిజ పెండ్లి కొఱకు   గిరిరాజు పిలువంగ
వెడలి రెల్ల భీష్ము పెండ్లి జూడ
నాది  దంపతులిక  నానంద మొందుచు
నిత్తు రన్ని సిరులు భక్తులకిల


Sunday, February 25, 2018

న్నిందల మోపి పిమ్మటనునెమ్మిని మెచ్చెను మేలుగోరుచు

బందిగ దాను జైలువడ బాధను నొందుట కారణంబున
న్గొందల మందిడెందమున  గోపన రాముడు మౌనముంటకు
న్నిందల మోపి పిమ్మటనునెమ్మిని మెచ్చెను మేలుగోరుచు
న్నందరి వోలెకాక రఘురాముడు దైవపుటంశమౌటయే

ఆకాశవాణి

బేల విశుద్ధ రూపవతి ప్రేమప్రపూర్ణవిలాసవర్తి శ్రీ.,                బాలను హేమచంద్రుడట బాహువశీకృతమూర్తిజేయగా., కోలను మన్మధుండటుల కూరిమితూపులవేయ నా  ప్రహా., రాలను పూలుబూసినవి రమ్య సుగంధములన్ వెలార్చుచున్