Tuesday, July 31, 2018

న్సాగరమబ్ధితోయనిధిసంద్రమువారధిద్వీతవంతమున్


గూగులునందుజూడగనుగోముగగన్పడెవారిరాాాశిగాాా
సాాాాగరమబ్ధితోయనిధిసంద్రమువారధిద్వీతవంతము
న్నీగతిపూరణంబులనుశిష్టజనంబులుమెత్తురేభువిన్
బాగుగలేనిచోమరలవ్రాతునుజెప్పుడుస్వామి!యిత్తఱిన్

సాగరంబబ్ధి శరనిధిసంద్రముదధి

జలనిధికివెయె పర్యాయములగునార్య!
సాగరంబబ్ధి శరనిధిసంద్రముదధి
యిటుల నెఱుగంగ వలయును నితరములకు
భాషపెంపొందుకొఱకుగాబ్రతియొకరును

రమ్మునుగ్రోలినప్డె,మునిరాజని మెత్తురుగాదెసజ్జనుల్

ఇమ్మహిజాలమందితమయింటినినమ్ముదునంచుబల్కుగా
రమ్మునుగ్రోలినప్డె,మునిరాజని మెత్తురుగాదెసజ్జనుల్
రమ్మునుగ్రోలకుండగనురాతిరివేళనురామమంత్రము
న్నిమ్ముగబాఠనంబుగడునిష్టతతోడనుజేయువానినిన్

Monday, July 30, 2018

రమ్మునుగ్రోలినపుడెమునిరాజన నొప్పున్

ఇమ్ముగ భగవద్గీతను
గమ్మగబోధించుతఱిని గవివరులెల్లన్
నమ్మరొయంచునునాసా
రమ్మునుగ్రోలినపుడెమునిరాజన నొప్పున్

పడతిపడంతినేకదవివాహముగావలెశాస్ర్రపధ్ధతిన్



పడతులరాజ్యమందుగలభామినులందరునాడువారినే
కడుగొనిపెండ్లిజేసికొనుకట్టడియుండుటకారణంబుచే
పడతిపడంతినేకదవివాహముగావలెశాస్ర్రపధ్ధతి
న్నడకువగల్గియుండునెడనాయువుబెర్గునుదప్పకుండగన్

Sunday, July 29, 2018

పడతిపడతినేపెండ్లాడవలెనువిధిని

పురుషరూపముపరమాత్మ పుడమియందు
తనరెజీవాత్మయింతిగదనకుదాను
పతియుసతులుగవారలుబరగుకతన
పడతిపడతినేపెండ్లాడవలెనువిధిని

Saturday, July 28, 2018

కాంతయెకారణమ్మగునుగాదెధరన్ గలహమ్ములేర్పడన్

కాంతయెకారణమ్మగునుగాదెధరన్ గలహమ్ములేర్పడ
న్గాంతయెకారణంబుధరగాంతలమధ్యనగల్గసూయయే
కాంతులవల్లనేనదియుగారణమౌనుదురాగతంబున
న్సాంతముబ్రేమతోనునికి,సర్వులకందము,జూడముద్దగున్