Wednesday, October 31, 2018

హర్మ్యంబుననెదిగెవటవృక్షమహో

ధర్మ్యపునడకలుదప్పగ
హర్మ్యంబుననెదిగెవటవృక్షమహో
కర్మ్యంబులోటునగునెడ
హర్మ్యములందెదుగుచుండునవనీజములే

Tuesday, October 30, 2018

కోడిని

కోడిని బట్టిముక్కలుగ గోసిభుజించిరిగాదెశ్రోత్రియుల్
వాడిగనట్టులన్బలుకపాపము,కోడియుజీవియేగదా
కోడినిడకుండగనుగోసినముక్కలుదిందురేభువిన్
బాడిగదోచెనేయదియపాపవినాశన,రాజశేఖరా!

కోడినిశ్రోత్రియులుగోసికుడిచిరిప్రీతిన్

వాడిగనిటులుగబల్కుట
కోడినిశ్రోత్రియులుగోసికుడిచిరిప్రీతిన్
బాడిగనేదోచెయదియ
కోడియునొకజీవికాదె?కువలయమందున్

Monday, October 29, 2018

పుష్టినిదుష్టినొసగుగద,పు

శిష్టులజతగూడినచో
పుష్టినిదుష్టినొసగుగద,పురువులమందుల్
నష్టముజేయునునొడలికి
కిష్టప్పా!తినకుమెపుడుకేళినినైనన్

పుష్టినిదుష్టినిచ్చునటపుర్వులమందులుమ్రింగమేలగున్

పుష్టినిదుష్టినిచ్చునటపుర్వులమందులుమ్రింగమేలగున్
పుష్టినిదుష్టినిచ్చుననిబొంకులుసెప్పిరివారిమాటలన్
నిష్టముగాదలంచకుడుకీడునుజేయునుబుర్వుమందులే
కష్టములెన్నియోకలుగుగాంచనిరోగములుద్భవించుచున్

Sunday, October 28, 2018

ముదిత నపుంసకున్గలిసిపుత్రు

ముదిత నపుంసకున్గలిసిపుత్రునిబొందుటచిత్రమెట్లగున్
ముదితలనంగచుల్కనయ,పుత్రునిబొందిర,యేమియిట్లుగన్
జదువులులేనివారివలెజయ్యనదప్పుగబల్కనొప్పునే?
ముదితనపుంసకున్గలిసిపుత్రునిబొందుటచిత్రమేగదా