Thursday, October 31, 2019

గార్తికమాసమందుజొరగందగదేశివమందిరమ్మునన్

ఆర్తినిబూజజేయుచునునాశివపార్వతిపాదపద్మముల్
పూర్తిగబ్రేమతోడుతనబూరెలుగారెలునారగించగా
గీర్తనలెన్నియోదనరగేలునుమోడ్చుచుబాడుచుండుచో
గార్తికమాసమందుజొరగందగదేశివమందిరమ్మునన్

కార్తికమునశివునిగుడినిగాలిడదగునే

ఆర్తినిఱేయింబగలును
కీర్తించుచుసోమనాధుగీర్తనతోడన్
బూర్తిగమైమఱచినయెడ
కార్తికమునశివునిగుడినిగాలిడదగునే

Wednesday, October 30, 2019

తామసచిత్తుడేజనులదైవముగాప్రణతుల్గొనెంగదా

రామునిగాధలన్మిగులరమ్యపుపోకడలన్రచించియా
తామసచిత్తుడేజనులదైవముగాప్రణతుల్గొనెంగదా
తామసుడైననున్వినుముతాలిమిగల్గియునెల్లవేళలన్
బ్రేముడిజూచువారలనుబ్రీతినిదైవముగాదలంతురే

తామసచిత్తుండెజనులదైవంబయ్యెన్

పామరుడౌవాల్మీకియ
తామసియైరచనజేసిధారుణియందున్
రామునిగాధనునీయగ
తామసచిత్తుండెజనులదైవంబయ్యెన్

Tuesday, October 29, 2019

దత్తపది

కోరికయనెడుగుర్రమ్ముకోరునెడల
పొసగనోపమైలవరపుపుత్రివినుము
వానిగుండాటనాడింతునీనిమిసము
చీరరావెలతాంగికజేరనన్ను

అడరన్సోదరుడాాా

అడరన్గోపముసోదరీమణికినాయాసంబుతోనుండగాన్
నడరెన్సోదరుడారగింపభగినీహస్తాన్నమ్మున్భీతుడై
కడునాలోచనజేయగాదెలియునెక్కాంతల్సరేతాముగా
బుడమిన్గోరుదురెల్లవేళలనుదాపుట్టింటీసౌభాగ్యమున్

Monday, October 28, 2019

భగినీహస్తాన్నమనినవడకెననుజుడే

వగలాడిదనముదోడను
బగలనునికబెంచుచుంటపబ్బముగాగన్
భగభగలతోడగన్పడు
భగినీహస్తాన్నమనినవడకెననుజుడే