Tuesday, December 31, 2019

వంతలనిడుగాత!నూత్నవత్సరమింకన్

సుంతయుదెలివిగ మసలక
నెంతయొమూర్ఖమ్ముతోడనిలచరియించన్
సంతులకోపానలములు
వంతలనిడుగాత!నూత్నవత్సరమింకన్ 

Monday, December 30, 2019

కాంతకువీడుకోలువలుకందగునేడుహితమ్ముగోరుచున్

సాంతముమంచిజేసియునుసంతసమొందగనేగుచున్ననా
కాంతకువీడుకోలువలుకందగునేడుహితమ్ముగోరుచున్
శాంతముసౌఖ్యమున్నిడుచుసర్వజనంబులమెప్పుపొందుటన్
శాంతికిపాతవత్సరముస్వాగతమీయగనొప్పుగ్రొత్తకున్ 

కాంతకువీడ్కోలువలుకగాదగునేడే

సాంతముసుఖమయమగుచును
జింతనలేలేకయుండిసేమమునిడుచున్
శాంతముగాజనువర్షపు
కాంతకువీడ్కోలువలుకగాదగునేడే

Sunday, December 29, 2019

అవధానంబటరాణ్మహేంద్రవరమందయ్యోభయంబయ్యెడిన్

అవధానంబుననారితేరినమహామేధావులచ్చోటనే
నవధానంబులుసేయనేర్వగనుబాహాటమ్ముముందుండగా
నవధానంబటరాణ్మహేంద్రవరమందయ్యోభయంబయ్యెడిన్
గవిశార్దూలురుభీతిలింగరికనెక్కాలంబునైనన్సుమీ

అవధానినిరాజమండ్రియడలంజేసెన్

అవిరళభాషాసంపద
కవనపురూపంబునిచ్చుగవులుండియునున్
స్తవనీయుండగుమాయీ
యవధానినిరాజమండ్రియడలంజేసెన్

Saturday, December 28, 2019

పడతులుపాశురమ్ములనుభక్తిపఠించినగల్గుబాపముల్

పడతులుపాశురమ్ములనుభక్తిపఠించినగల్గుబాపముల్
పడతులెగాకపూరుషులుభక్తిపఠించినగల్గుబుణ్యముల్
విడువకనిష్ఠతోడగడుపేర్మినిజేయగబూజలాదులన్
వడిగనెనిచ్చుమోక్షమునవారితభక్తికిమెచ్చికృష్ణుడున్

పాశురమ్ములజదివినపాపమబ్బు

పాశురమ్ములజదివినపాపమబ్బు
నేమి గురువర!భావ్యమె యిట్లుపలుక
పాశురమ్ములజదివిన బడయగలము
పుణ్యలోకాలుదప్పకపుడమివీడ