Thursday, March 11, 2021

ద్రుపదతనయకు మ్రొక్కె,దుర్యోధనుండు

 రాజసూయమ్ము జూచిన రాజులపుడు

కానుకలను సమర్పించి కరముమోడ్చి

ద్రుపదతనయకు మ్రొక్కె,దుర్యోధనుండు

మౌనముద్రను వహియించె మౌనివోలె

విరిసిన పద్మమందు గడు వింతగ బుట్టెను,కాలనాగమే

 సిరులను నీయు భామయును శీతల పర్వత రాజపుత్రికే

విరిసిన పద్మమందు గడు వింతగ బుట్టెను,కాలనాగమే

జరజరప్రాకి వేగముగ సంద్రములన్నిటి నీది చంపెగా

గరువపు బ్రాణభీతియు ను గర్మము వెంటనురాగ ఱేనికిన్

Wednesday, March 10, 2021

విరిసిన కమలమున బుట్టె,విషసర్పమ్మే

 సిరులను నిచ్చెడు లక్ష్మియె

విరిసిన కమలమున బుట్టె,విషసర్పమ్మే

నురగలుగక్కుచు చచ్చెను

బరమాత్ముని గర్భగుడిని పరిత్రాణమునన్

Tuesday, March 9, 2021

కలను,సహింపగావలయు గాపురమందభివృద్ధి,గోరినన్

 కలతలురేపు దుష్టులను,గాపురుషాదుల చేష్ట,శత్రుమూ

కలను,సహింపగావలయు గాపురమందభివృద్ధి,గోరినన్

గలతలులేని గాపురము గాంచును వృద్ధిని నెల్లవేళలన్

గలనున సైతమున్ వలదు కర్కశరూపము మాానవాాళికాన్

కలసహింపవలయు గాపురమున

 సూటిపోటు లుగల మాటల,శత్రుమూ

కలసహింపవలయు గాపురమున

చేయిచేయి గలుప చేటుగలుగుగద

మౌనమయది మేలు మౌని వలెను

Monday, March 8, 2021

కోరకమున్నె మేలునొనగూర్చెడివారలె,క్రూరచిత్తులౌ

 

ఆరయ మంచివారుగను నందఱిచేతను మెప్పునొందురే

కోరకమున్నె మేలునొనగూర్చెడివారలె,క్రూరచిత్తులౌ

నేరము జేయకుండినను నేరము మోపుచు హింసజేయునౌ

వారిని దవ్వుగానునుపు బాధ్యత యందరి మీదయున్నదే

గోరనిదె మేలొనర్తురు,క్రూరులెపుడు

 మంచివారితరులకు ప్రేమను నిరతము

గోరనిదె మేలొనర్తురు,క్రూరులెపుడు

జేయుచుందురు దుష్కృతి చేతలందు

నికను మానసి కంబుగ నిడుము లిడగ

సంశయించరు పుడమిని శర్మ! యెపుడు