శాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్
భ్రాంతిని నొంది యట్లుగను బల్కిరి వారలు నమ్మబోకుడీ
శాంతిని గాకవా రిడు నశాంతిని నట్లుగ బోధజేయుచున్
శాంతిసతమ్ము శిష్టజన సౌఖ్యమె యిచ్చునుదప్పకుండగన్
శాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్
భ్రాంతిని నొంది యట్లుగను బల్కిరి వారలు నమ్మబోకుడీ
శాంతిని గాకవా రిడు నశాంతిని నట్లుగ బోధజేయుచున్
శాంతిసతమ్ము శిష్టజన సౌఖ్యమె యిచ్చునుదప్పకుండగన్
సౌఖ్యమిచ్చును దప్పక సర్వులకును
శాంతి సతతమ్ము, దుర్జన సౌఖ్యదమ్ము
పరులు దుఃఖము తోడను బాధపడుట
దుర్జనసహవాసమ్మున దురిత మబ్బు
భీష్మద్రోణుల కావహంబు జరిగెన్ భీమార్జునుల్ గాంచగన్
భీష్మద్రోణు లనంగ గౌరవులకున్ బేరాశ యుద్ధంబునన్
చష్మాయుండెడు వీరవర్యులనుచున్,సంతోషమందుండగా
భీష్మద్రోణుల సంగరంబునగునేభీమార్జునుల్ జూడగా
చష్మాలేకయె యిట్లనె
భీష్మద్రోణుల సమరము భీముండు గనెన్
భీష్మద్రోణుల నెయ్యము
కూష్మాండపు విత్తువోలె గురుతర మగునౌ
వాలము లేకయుండగను వానరమూకల జెక్కు పుత్రునిన్
చాలును శిల్ప చెక్కడము శ్రద్ధగ బొమ్మిక పాఠశాలకున్
మేలగు జీవితంబునకు,మెప్పును బొందెద వంచు బల్కిశి
ల్పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్
వాలమురహి వానరముల
బాలుడు దాజెక్క శిలనుబంధువు మిగులన్
హేళన జేయుచు నాశి
ల్పాలను దునియలుగ జేసె పటువిక్రముడై
విసుగుం జెందక ప్రత్యహంబునిట దేవేరిన్ మనంబందునన్
నసమానంబగు రీతినిన్ దలచి యాహాహా యనంగానికన్
బసయౌనట్లుగ వ్రాయబూనుదును నాపద్యంబు లన్నింటినిన్
వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణంబయ్యయో