Monday, January 13, 2014

కుబేర యాగము

అలకా పురమ్ము నందున
కళకళ లాడంగ నచట గ్రతువులు జేయ
న్నలనాటి యజ్ఞ శాలను
దలపించెను శంక రార్య !తలపుల లోనన్

(విజయవాడ లో కుబేరయాగము  చేయుచున్న
ప్రాంగ ణ మునకు అలకాపురము అను పేరు
పెట్టిరి )

వేద మంత్రాలు జదువగ విబుధ వరులు
చేయు చుండిరి యాగంబు శిష్య గణము
విజయ వాడను  పురమున వైభవముగ
వేయి కన్నులు సరి వోవు వీ క్ష కులకు

ఘంట సాల సంగీతపు మంటపమున
పెద్ద యెత్తున నేర్పాట్లు  దద్దరిల్లె
చూడ ముచ్చట గొల్పెను  చూచు కొలది
వంద నంబులు వారికి  వంద లాది

యాగ మీయది  చేసిన నాయువుయును
 ధనము మెండుగ కలుగును దళితు లకును
చేత నైనంత రీతిలో చేయు నెడల
వేరుచెప్పగ బనిలేదు వేత్తల కిది .

దేశ సౌభాగ్యము నకునై దేశికు లట
చేయు చుండిరి యాగము ల్చెలువ గాను
దాన ,నభివృద్ధి జెందును ధరను మరిని
పాడి పంటలు ,సిరులును  బహు ళ ముగను

కణ కణం గుగ  నిప్పులు గన బడంగ
హోమ ద్రవ్యాలు వేయుచు హోత లచట
మంత్ర పూర్వక హోమంపు తంతు జరుప
హాయి గొలిపెను మనసున కమితముగను

ఇట్టి యాగంబు  జరిపించి  నట్టి స్వామి
భారతీ మహా స్వామియే  భవ్యు డార్య !
వాని కిడుదును మనసార వందనములు
అంద జేయుడు మఱి మీరు యాబ లూ రి !





 

No comments:

Post a Comment