Wednesday, January 8, 2014

ఆశీ ర్వచనము

 రాపాక వంశ మండన
మాపాపము ల ణ ఛి వైచి మమ్ముల దయతో
కాపాడు మయ్య నిరతము
మీ పాదము లాశ్ర యింతు మీ దయ కొఱకున్

బంధు ప్రీతిని గలిగిన  బాంధ వుండు
స్నేహ సంపద నొందిన చెలియ కాడు
భువిని రాపాక వంశపు బుధు డతండు
కల్ల కాదిది నిజమునే బల్కు చుంటి

మాయ మర్మము లెరుగని మనిషి యతడు
మత్సరమ్మును లేనట్టి  మాన్యు డతడు
సాటి మనుజుని మనిషిగా సాకు నతడు
సాటి లేరిక యతనికి మేటి భువిని

స్వార్ధ మనునది లేనట్టి సహృద యుండు
వీ రు నావారు వారు పైవారనుటను
వినగ లే దె పుడును మఱి ,వీ ను తోడ
దైవ తుల్యుడే యిక పైన ధరణి ప్రజకు

ప్రభల కాకర మైన ప్రభాకరునకు
సకల శుభములు గలిగించు శంకరుండు
మరల జన్మము లేకుండు వరము నొసగి
యతని నాత్మకు శాంతిని నిచ్చు గాక !

[ అన్న గారైన  లేటు  ప్రభాకర రావు గారి  సంవత్స రీ కములు  సందర్భముగా
పోచిరాజు సుబ్బారావు  సమర్పించు పుష్పాంజలి }
9-01-2014.



 

No comments:

Post a Comment