Friday, July 31, 2015

జ్వర పీడితు డొకడు గోడను జయ్యన దూకెన్

విరహము తోడన నొగులుచు
జ్వర పీడితు డొకడు గోడను జయ్యన దూకె
న్నిరవుగ గలియుట కొఱకై
పెరవలి సీతమ్మ  దనను బ్రేమించంగన్ 

Thursday, July 30, 2015

హరికరుణా కటా క్షమునకై తపియింతురు క్రై స్తవుల్ సదా

నిరతము బూజజేయుదు  ననేకపు రంగులపూలు వేసియున్
హరికరుణా  కటా క్షమునకై, తపియింతురు క్రై స్తవుల్ సదా
కరుణను జూ పుమంచు  నయగారము నొం దగ  మానవాళి కిన్
వరముల నీయగ న్దలచి పాయని భక్తిని విన్నవింతురే

పద్య రచన - గురుపూజ

గురువు  దైవము ,తండ్రియు గురువు మాత
యన్ని రంగాల యందున  మిన్న యతడు 
సాటి యుండరు  పుడమిని సద్గురు వున 
కార్య ! వందనం  బులుసేతు న య్య ! మీకు 

Wednesday, July 29, 2015

సతి చావుకు కారకుండు శంకరుడు గదా

పతియే దైవమ్మెట్ల గు
సతి చావుకు కారకుండు,  శంకరుడు గదా
సతతము శుభముల నిచ్చెడు
పతిదేవుడు మనకు గాదె ? పరి కింపంగాన్


Tuesday, July 28, 2015

పురస్కార సభ

రకర కములుగా గలయట్టి  రమ్య మైన 
పూ జనములనం  దుకొనగ బోవు  పం డి 
తులకు  వందన మాచరిం  తును ని  జముగ 
నందు  కొను డ య్య ! యందరు నందు కొనుడు 

శంకరయ్య గారు

సకల శుభములు గలిగించు  శంకరుండు 
పరమ గురువుల రుగ్మత బా ఱద్రోలి 
యాయు రారోగ్య ములతోడ  హర్ష మొదవు 
నట్లు  జేయుత ! మాశంక  రార్యుల నిల 

మోసము చేయు వారలకె పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్

దోసములే కలుంగు మఱి దుష్ట జనాళికి  నెల్లెడ న్సుమీ
మోసము చేయు వారలకె ,పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్
వాసము జేయుచుం దరిని నాసమవర్తిని నెల్ల వేళల న్
వాసిగ  భక్తితో గొలువ బాపము ద్రోచుచు  నెల్ల వారికిన్ 

Monday, July 27, 2015

పాయసమున నుప్పు గలుపబడ దీ యనయౌ

తీయని దనముంబోవును
పాయసమున నుప్పు గలుపబడ ,దీ యనయౌ
పాయసమున దగు  చక్కర
వేయంగా గఱగి  యదియ ప్రియమగు రీతిన్

పద్య రచన -అబ్దుల్ కలామ్ గారికి శ్రద్ధాంజలి

లేవు లేవాయె  యికమాకు లేవు నీవు
కాన రానట్టి దూరమ్ము  గడచి నావు 
మాయ మర్మము  లెఱు గని  మనిషి వీవ 
సాటి  యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?

ఆశ లేదయ్య  నీకుగా నాశ లేదు
ఉన్న దానితో సంతృప్తి నొంది తీవు
నీవు చేసిన సేవలు నెమ్మనము
 భద్ర పఱతుము నిరతము భవ్య చరిత!

ఏమి  నేరము జేసితి  మింత లోన
విడిచి పోతిరి మమ్ముల విడిచి యిచట
నీదు రాకకు మేమిట యెదురు చూతు
మోక  లాముజీ ! నిజమిది యొ ట్టుగాను

సకల శుభములు  గలిగించు శంకరుండు
మరల జన్మమ్ము లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ  ననుమ తించి
యొసగు  గావుత ! యాత్మకు  నొనరు శాంతి పద్య రచన -కుశ లవులు -యాగాశ్వము

అశ్వ మేధ యాగ యవనా శ్వ  మద్దిర
దాని కిరుదె  సలను దనరు వారు 
రాము తనయు లుగద ,రమ్యులు ,వీరులు 
నశ్వ రక్ష ణ కయి యచట గలరు 

తండ్రు లేవురు గలరండ్రు ధరను బుధులు

కనిన తండ్రిపెం  చినతండ్రి  గారవమున
నుపనయనమును నొనరించు నుత్త ముండు
కూతు నిచ్చిన  మామయు ,గురువు నాగ
తండ్రు లేవురు గలరండ్రు ధరను బుధులు

Saturday, July 25, 2015

ఆహ్వానము

ఛందో శాస్త్రము గూరిచి 
యందముగా దెలియ జేయ నార్యులు రాగ
న్నందరి  జనములు దమతమ 
డెం దం బులు  సంతసించ డే కురి  రచట న్ 

బ్రాహ్మణుండు కాకి పలలము దిను

బ్రాహ్మణుండు కాకి పలలము దినునట
చూచితీవ ? రమణ ! చోద్యమ యది
కాల మహిమ ,యిదియ ,కనగనిం  కనునేమి
యుండు  దైవ మ !నతు  లొనర  జేతు 

పద్య రచన -నెలత లారి చక్రము

నేర్వ  గనురాని  విద్యలు నెలత లకిల 
గలవె ? నెంచిచూ  డం గను గాంత !కనుము 
లారి  చక్రము  నెటులుగా లాగుచుండె ?
వింత జూచెను  నాయవి  వీక్షణ ములు 

పుష్కర యాత్ర

రాజ మాధవి  విజయమ్మ తేజుగాడు
మఱియు నేనును  బయనమై నేరు గాను 
కదలి  పుల్లేటి కుఱ్ఱు నా  గ్రామ మునకు 
చేరి యచ్చట నించుక సేద దేరి 
మరల యటనుండి పయనమై  మంచి గాను 
జేరు కొంటిమి మాయూరు  క్షేమ ముగను

దారి  పొడుగునా  గలయట్టి దర్శనీయ
ములను జూచుచు మధ్యన మో దమలర
కాఫి  టిఫినులు  సేవించి కడుపు నింపి
పయన  మైతిమి  యట నుండి  గమ్య మునకు

ఇల దొడ్డవరంబున మఱి
వెలసిన యాసోమ  నాదు వేడుక మీర
న్గొలిచితి నభిషే కంబులు
బలుమారులు  సేతవలన వరమగు రీతిన్

దొడ్డ వరమున గలయట్టి తోయగములు
పరమ పావన  మైనవి  యరసి జూడ
తాన  మాచరిం చినగల్గు పుణ్య మెంతొ
పుష్క రంబున రెట్టిం పు  పుణ్య మబ్బు

దినము దినమును జేసితి దివ్య ముగను
తనర గోదా వ రీ నది  తటము నందు
వైన తేయపు నదియందు  వరుస గాను
పది దినంబులు విడువక  బాగు గాను

చుట్టు  పక్కల గ్రామాల  చుట్ట ములను
జూచు కొఱ కును  నేగితి  చోద్య మొదవ
వారి యాతిధ్య మింపుగ బడసి యికను
చేరి తింటికి నాటొ పై  క్షేమ ముగను

అప్పన పల్లి పురంబున
నొప్పుగ వేంచేసి నట్టి యుత్సవ మూర్తి
న్దప్పక సేవించుట కును
నప్పతినిం జేరుకొంటి హర్షము తోడన్

నాదు తమ్ముడు రాంబాబు నన్ను తీసి
కొనుచు నేరుగా నాలయం బునకు నేగ
నా లయంబున  బూజా రి యధిక భక్తి
జరిపి  పూజను నిచ్చెబ్ర సాద  మపుడు

పాల కొల్లున గలయట్టి బావ గారి
యింటి కేగియ  చట నుండి యేను రైలు
నెక్కి తిన్నగా వచ్చితి మింటి కపుడు
సాగె పయనమ్ము సుఖముగా సామి ! మాది

తమ్ముళ్ళ యండదండలు
ముమ్మరముగ నుండు కతన మోదము తోడ
న్నిమ్ముగ మా పయనంబులు
గమ్మున నట సాగె నార్య ! గమ్మత్తుగ గాన్

నాగరాజు శర్మ నా బడు  నాతడు
మేన యల్లు డగును వాని  సాయ
ముంట  వలన పయన  ముసుకర  మాయెను
నంద జేతు నిపుడె యాశి సులను ,


Friday, July 24, 2015

చెంత సాయి యుండ ,చింత లేల

చింత లుండవు  నిసుమం తయైన నునిక
చెంత సాయి యుండ ,చింత లేల ?
సాయి చెంత యుండ సాదరం  బుగమఱి
కొలువు  మయ్య ! నీవు కోర్కె దీరు 

దత్త పది -అంగ -వంగ -రంగ -భంగ (పుష్కరములు )

వంగ రంగును బోలిన వలువ గట్టి 
పుష్క రంబున వెలసిన పుష్కరార్య !
యంగ రంగవై  భవముగా భంగ ములన 
దేలి యాడుచు నిమ్ముమా దీవెన లను 

దత్తపది -ఆత్మ -ప్రేతాత్మ -జీవాత్మ -పరమాత్మ(పు ష్కరములు )

ఆత్మ లనబడు నివిగజీ  వాత్మ మఱియు 
ముక్తి కలిగించు పరమాత్మ పుష్కర మున
పిండ ములరూపు ప్రేతాత్మ ప్రీతి కలిగి 
శాంతి కలిగించు నాత్మకు సర్వు లకును 

దత్త పది -పదసంపద -జ్ఞాన సంపద -ధన సంపద -బంధు సంపద (పుష్కరములు )

సంపద పదముం జ్ఞానము 
సంపద నిక బంధు, ధనము సమకూ రం గ
న్నింపుగ బుష్కరములలో 
సొంపుగ దా స్నానమాడ సుకరమ యగునున్ 

దత్త పది -వక్త -ప్రవక్త -భక్త -అవిభక్త (పుష్కరములు )

భక్త  వర్యుల మనమవి భక్తముగను
పుష్కర మహిమ  బో ధించు బోధ కుండు
నరయ  చాగంటి  వారార్య ! హర్ష మొదవు
వక్త , గణు తించ దన రె ప్ర  వక్తగనిల 

పద్య రచన -కుంకుడు కాయలు

అంటు కొందురు  తరచుగా నతివ లార్య !
తనర కుంకుడు రసముతో తమత లలిల 
చూడ  ముచ్చట గానుండె చూడు కాయ 
బంతి వోలెను గుండ్రపు త్వక్కు కలిగి 

వరుని జూచి నంత భయము క లిగె

కారు నలుపు కలిగి కాకి గొం తుక  తోడ
బిగ్గ రగను  నఱచు పిల్లి  కండ్ల
వరుని జూచి నంత భయము క  లిగెనట
వధువు రాధ  కపుడు వనిత లార !

Monday, July 13, 2015

పద్య రచన -గోదావరి పుష్కరాలు

భువిని  పన్నెండు వత్సర  ములకు నదికి  
వచ్చు పర్వము  పుష్కరం బందు రిలను 
వచ్చె గోదా వ  రికిపుడు వంతు సామి !
యాచ రింతును  స్నానము  హర్ష  మొదవ 

పుష్కర స్నాన మొనరింప బోయె సిరులు

పుణ్య మెంత యో  కలుగును బూర్వికు లకు
పుష్కర స్నాన మొనరింప, బోయె సిరులు
పుష్క  రస్థల  మందున  ముష్కర తతి
దాడి జేయగ  మామీ ద   ధనము  కొఱకు 

Sunday, July 12, 2015

పద్య రచన - వెదురు బుట్ట

వెదురు బద్దలు  వరుసగ పేక పడుగు 
లుగను బేర్చియు భామల  ల్లుదురు  బుట్ట  
జీవ నంబును  గొఱకుగా  , చిత్ర మందు 
బుట్ట  నల్లుట  జూడుడు పొలతి యొకతె 

రాముడు రావణుని మెచ్చి రాజ్యం బొసగెన్

రాముని గాధను వినకను
రాముని నామంబు మఱియు రాముని గూర్చి
న్నేమఱచియు ని  ట్లు  పలికె
రాముడు రావణుని మెచ్చి రాజ్యం బొసగెన్

Saturday, July 11, 2015

హైదరా బాదులోన నౌ కాశ్ర యమ్ము

హైదరా బాదులోన నౌ  కాశ్ర యమ్ము
బాగు సెప్పితి రార్యులు ,వారు కట్టు
దురట టాంకుబండు దరిన  తోయజాక్షి !
పోయి చూడుమ యొకసారి   భూమి  నచటి 

పద్య రచన - బాదుషాలు

బాదు షా లను  జూడగ భరణి !యిపుడె 
యూరు  చున్నది  నిజముగ  నోరు నాది 
తెచ్చి యీయవ ? వాటిని  నిచ్చ కముగ 
తిందు  నిప్పుడే తృప్తిగ దేన్చు కొనుచు 

Friday, July 10, 2015

విద్యాశూ న్యుడు జనులకు వేదము జెప్పున్

పద్యములు వ్రాయ  నేరడు
విద్యాశూ న్యుడు ,జనులకు వేదము జెప్పున్
విద్యలతో బాటుగ మఱి
విద్యా నా ధుం డు మిగుల వివరము తోడన్

పద్య రచన -మగ్గము -నేత

వీ రడు మగ్గము యొద్దన 
చీరను నట నేయుచుండె సిలుకుది యదియే 
వారము పట్టును నటయది 
చీరలు నివి మంచి వనుచు జెప్పెను  నాతో 

పద్య రచన -తిరుపతి వెంకట కవులు

జంట  కవులుగ  బేరొం ది  మింటి వరకు 
పేరు ప్రఖ్యాతు లార్జించి ,బిరుదు లెన్నొ 
పొంది  తెలుగుసా  హిత్యపు  పోకడలను 
నాల్గు  వైపుల వెదజల్లి వెల్గి  నట్టి 
వెంక  టకవుల  కునిడుదు  వేయి నతులు 

Thursday, July 9, 2015

కమలాప్తుని రశ్మి శోకి కమలె గమలముల్

కమలములే వికసించెను
కమలాప్తుని రశ్మి శోకి కమలె గమలముల్
కమలాకరములె  యింకగ
కమలములకు జీవ మవియ కమలాకరముల్ 

పద్య రచన -సీతమ్మ మాతయొద్దకు

చిత్ర  మయ్యది జూడుము  చిత్రముగను
రామ లక్ష్మణు ల్  వాల్మీకి రాయి యగుచు 
చూచు  చుండగ  దృశ్యము  సూటి గాను 
బోవు  చుండెను  సీతమ్మ  భూమి జీల్చి 
తనదు  మాతను గలువగ  తమము  కలిగి 

ముక్తికి మార్గమ్ము మద్యమును గ్రోలుటయే

భక్తిని గొలుచుట శంభుని
ముక్తికి మార్గమ్ము ,మద్యమును గ్రోలుటయే
యుక్తము ,పగలంతయు మఱి
శక్తికినిన్మించు  పనిని సలిపెడు  నెడలన్ 

Tuesday, July 7, 2015

రంభారావణు ల ప్రేమ రమ్యము జగతిన్

కంభంపాటి తనూజుడు
దంభము తో బలికె నిపుడు దా రా  వణు డే
రంభను మోహించె గమఱి
రంభారావణు ల ప్రేమ రమ్యము జగతిన్ 

పద్య రచన -అరటి పళ్ళు

చిత్ర మయ్యది జూడుము  చిత్ర లేఖ !
అరటి  పండ్లను  బెట్టిరి యమ్ము టకయి  
యత్త   మొక్కటి  గొనిదేవ ?యార గింపు 
జేతు  శివునకు ,శుభములు  సేయు మనకుభార మనిరి తాళి భార్యలె ల్ల

సొగసు దనము నికను  సోకులు గలిగియు
కన్ను మిన్ను  గాన  క గరు  వమున
భార మనిరి తాళి  భార్యలె  ల్లరు మఱి
కలియు  గమిది ,యెన్నొ  కలుగు నికను 

Monday, July 6, 2015

పద్య రచన -అతిలోక సుందరి

రంభ యనుకొంటి  మరినిన్ను  రామ ! నేను
భువికి వచ్చి న భూలోక ముగ్ధ వైన 
నీదు  సొగసుద  నమునకు  నెమ్మి తోడ 
పలుకు చుంటిని  జోహార్లు  భామ ! నీకు 

Sunday, July 5, 2015

పద్య రచన -రాణా ప్రతాప్ సింగ్

 అరయ  రాణా ప్ర తా పసిం  గతడు  కంటె ?
బాహు  బలుడును నాజాను  బాహుడు గద
శత్రు మూకల జెండాడి జయము బొందె
జగతి  నె వరును నతనికి  సాటి లేరు 

కలికి పద తా డ నమ్ము లే కడుప్రి యములు

కలికి పద తా డ నమ్ము లే కడుప్రి యములు
కొందరికి మాత్రమే ,మఱి  యంద  ఱి కది
పోల్చు ట న్యాయమే యగు   బోధ కుండ !
కోప  పడకుడు  నాపైన కొంచె మైన 

Saturday, July 4, 2015

అంశం- వృక్షసంరక్షణ ఛందస్సు- ఆటవెలది. నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా ‘ప - చ్చ - ద - నం’ ఉండాలి.

పల్ల  వించ దరులు చల్లద నమును ప
చ్చద నమును గలిగియు జంతు తతికి
దయను నీడ నిచ్చి తా రక్ష సేసి నా
నందము గలిగించు నమ్ము డా ర్య !

పద్య రచన -భరతుడు

 చిత్ర మయ్యది  జూచియు  జెప్పు చుంటి 
భరతు డా తడు  శౌర్యుడు  బాల్య మందె 
క్రూర మృగముల  తోడను  దైర్యముగను 
నాడు  చుండెడి  వాడుగా  నర్ధ  మయ్యె 

Friday, July 3, 2015

స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె

స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
ననుట సరిగాదు  మారీచు డ దియ ,మారి
యటుల ,మాయను గల్పించి యాయమ పుడ
మి దుహిత నపహరింప గ  నదను జూచి 

పద్య రచన -పిల్లులు పాలుద్రాగు ట

పిల్లు  లగమి మరిని  పెల్లుబికిన సంత 
సంబు తోడ పాలు సర్వ  మునట 
త్రాగు చుండె  నార్య ! దవడలు  నొప్పి గ
లిగిన ,నొవ్వ  కయవి  ,లేచి  గనుము 

పద్య రచ న -బడిపిల్లలు

చిత్ర మయ్యది  చూడుము  సీను ! నీవు 
పుస్త కమ్ముల సంచిని పొదుపు గాను 
మూపు మీదను  బెట్టుకు  మోయు చుండ్రి 
యేమి  చదువులు చదువుదు రేమొ  వారు ?

Thursday, July 2, 2015

నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్

ఎన్నగ బుడమిని యంతట
నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్
మిన్నగు నతడును  నుండు నె ?
అన్నా ! మఱి సాటి నీకు నగుపడ డెందున్ 

Wednesday, July 1, 2015

హృత్పద్మము ముడుచు కొనియె నినుడు దయింపన్

సత్పధము లేమి నాతని
హృత్పద్మము ముడుచు కొనియె నినుడు దయింప
న్నుత్పలములు  ముకుళించును
దత్పరి ణా మంబులెపుడు  ధరలో గలుగున్ 

పద్య రచన -బొగ్గు గనులు

నల్ల  బంగార  మనుపేర  విల్ల సిలెడి 
బొగ్గు  గనిలోన కూలీలు మగ్గి మగ్గి 
మోయు చుండిరి  బొగ్గును  మురళి ! చూడు 
వారి కిడుదును  నతులునే  వంద లాది 

పద్య రచన - పొలములో వరినాట్లు

వనిత లచ్చట  పొలములో వరుస గాను
పాదు  చుండిరి  వరినాట్లు   పొదుపు  గాను
బాడు  కొనుచును జక్కగా పాట  లెన్నొ
కాయ  కష్టము  వారిదే , కంటి  రి గద !

వాణి,వీణ యెల్లపుడ పస్వరము పలుకు

వీణ  వాయించు  కాంక్షతో వేయి మార్లు
వీణ వాయించు  చున్నను  విసుగు లేక
యెన్ని మార్లయి  ననుమఱి యన్ని మార్లు
వాణి ,వీణ యెల్లపుడ పస్వరము  పలుకు