Saturday, July 25, 2015

పుష్కర యాత్ర

రాజ మాధవి  విజయమ్మ తేజుగాడు
మఱియు నేనును  బయనమై నేరు గాను 
కదలి  పుల్లేటి కుఱ్ఱు నా  గ్రామ మునకు 
చేరి యచ్చట నించుక సేద దేరి 
మరల యటనుండి పయనమై  మంచి గాను 
జేరు కొంటిమి మాయూరు  క్షేమ ముగను

దారి  పొడుగునా  గలయట్టి దర్శనీయ
ములను జూచుచు మధ్యన మో దమలర
కాఫి  టిఫినులు  సేవించి కడుపు నింపి
పయన  మైతిమి  యట నుండి  గమ్య మునకు

ఇల దొడ్డవరంబున మఱి
వెలసిన యాసోమ  నాదు వేడుక మీర
న్గొలిచితి నభిషే కంబులు
బలుమారులు  సేతవలన వరమగు రీతిన్

దొడ్డ వరమున గలయట్టి తోయగములు
పరమ పావన  మైనవి  యరసి జూడ
తాన  మాచరిం చినగల్గు పుణ్య మెంతొ
పుష్క రంబున రెట్టిం పు  పుణ్య మబ్బు

దినము దినమును జేసితి దివ్య ముగను
తనర గోదా వ రీ నది  తటము నందు
వైన తేయపు నదియందు  వరుస గాను
పది దినంబులు విడువక  బాగు గాను

చుట్టు  పక్కల గ్రామాల  చుట్ట ములను
జూచు కొఱ కును  నేగితి  చోద్య మొదవ
వారి యాతిధ్య మింపుగ బడసి యికను
చేరి తింటికి నాటొ పై  క్షేమ ముగను

అప్పన పల్లి పురంబున
నొప్పుగ వేంచేసి నట్టి యుత్సవ మూర్తి
న్దప్పక సేవించుట కును
నప్పతినిం జేరుకొంటి హర్షము తోడన్

నాదు తమ్ముడు రాంబాబు నన్ను తీసి
కొనుచు నేరుగా నాలయం బునకు నేగ
నా లయంబున  బూజా రి యధిక భక్తి
జరిపి  పూజను నిచ్చెబ్ర సాద  మపుడు

పాల కొల్లున గలయట్టి బావ గారి
యింటి కేగియ  చట నుండి యేను రైలు
నెక్కి తిన్నగా వచ్చితి మింటి కపుడు
సాగె పయనమ్ము సుఖముగా సామి ! మాది

తమ్ముళ్ళ యండదండలు
ముమ్మరముగ నుండు కతన మోదము తోడ
న్నిమ్ముగ మా పయనంబులు
గమ్మున నట సాగె నార్య ! గమ్మత్తుగ గాన్

నాగరాజు శర్మ నా బడు  నాతడు
మేన యల్లు డగును వాని  సాయ
ముంట  వలన పయన  ముసుకర  మాయెను
నంద జేతు నిపుడె యాశి సులను ,


No comments:

Post a Comment