Monday, July 27, 2015

పద్య రచన -అబ్దుల్ కలామ్ గారికి శ్రద్ధాంజలి

లేవు లేవాయె  యికమాకు లేవు నీవు
కాన రానట్టి దూరమ్ము  గడచి నావు 
మాయ మర్మము  లెఱు గని  మనిషి వీవ 
సాటి  యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?

ఆశ లేదయ్య  నీకుగా నాశ లేదు
ఉన్న దానితో సంతృప్తి నొంది తీవు
నీవు చేసిన సేవలు నెమ్మనము
 భద్ర పఱతుము నిరతము భవ్య చరిత!

ఏమి  నేరము జేసితి  మింత లోన
విడిచి పోతిరి మమ్ముల విడిచి యిచట
నీదు రాకకు మేమిట యెదురు చూతు
మోక  లాముజీ ! నిజమిది యొ ట్టుగాను

సకల శుభములు  గలిగించు శంకరుండు
మరల జన్మమ్ము లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ  ననుమ తించి
యొసగు  గావుత ! యాత్మకు  నొనరు శాంతి 



No comments:

Post a Comment