౧ తన్ను మరచి తనువు తానై తలచి
ఎన్నియో జన్మము లెత్తి తుది -తన్ను
తెలిసి తా నౌట పలు దేశ సంచార
కల న్మేల్కనుట కను
౨ తానుండి తానుగ దన్ను తా నేనెవ?
దే నుండు స్థానమేది ?
యను వానికి
నేనెవ డెక్కడ నేనున్నా నన్న మధు
పానుని యీ డు పలుకు
౩ .తనలో దను ఉండ దాను జడమౌ
తనువందున్నట్టు తలచు -మనుజుడు
చిత్రములో నున్నది చిత్రమున కాధార
వస్త్రమని ఎంచువాడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment