Sunday, March 28, 2010

శ తక సమర్పణ

సీతా రాముల కరుణన
శ తకమ్మును వ్రాసి యుంటి శ తకము పేరున్
సతతము నరుడా యన న
ప్పొత్తము నర్పింతునమ్మ ! పుణ్యము కలుగన్

వ్రాసితి శంకరు గరుణన
వ్రాసితి మఱి రామ భక్త శతకము నేనున్
దోసిలి నొగ్గియు సతతము
నాశ తొ నర్పించు కొందు నాన్నకు ప్రీతిన్ .

Sunday, March 21, 2010

రధ సప్తమి స్నాన శ్లో కము

యద్యజ్జన్మ కృ తం పాపం
మయా సప్తసు జన్మసు
తస్య రో గంచ శో కంచ
సమస్తం హంతు సప్త మీ .

Wednesday, March 17, 2010

౧౦ .వాయువులు

౧.ప్రాణము ౨.అపానము ౩.వ్యానము (వ్యామోహము )౪.ఉదానము (ప్రత్యుత్పత్తి )౫.సమానము ౬.నాగము (త్రేన్చుట)౭.కూర్మము (కాంతి )౮.క్రుకరము(ఆకలి మంట )౯.ధనంజయము (విశ్రాంతి )౧౦.దేవదత్తము (ఆవలింత ).

౭ వరల్డ్స్ ఆఫ్ ది వరల్డు

౧.చిచేనిజ -----మెక్సికో ౨.క్రీస్తు రెడిమేర్ -----------బ్రాసిల్ ౩.తాజ్ మహల్ --ఇండియా
౪.గ్రేటు వాల్ ఆఫ్ చీ నా ౫.కోలోజియం --ఇటలి. ౬.పేత్ర--జార్డాన్ .౭ .మాచు పిచ్చు --పెరూ.===========వీ టి గురించి వివరముగా తెలిసి కొనవలసి యున్నది.

Wednesday, March 10, 2010

బే స్మెంటు

బేస్మెంటు మంచిదయ్యెను
బే స్మెంటున నుండి మేము చూతుము టీ విన్
బే స్మెంటు లేని ఎడలన
భే షుగ్గా మాదు ఉనికి ప్ర శ్నార్ధకమౌ .

ఆరు నెలలుగ నుంటిని నమెరికా లొ
ఐన పది +రెండు రోజులు పైన నుంటి
మిగులు రోజులు బేస్మెంటు గాగ నయ్యి
వెడలె రోజులు మాకట్లు వింతగాను .

బే స్మెంటుకు వందనములు
బే స్మెంటే మాకు నిల్లు భే ష రతు గ గన్
బే స్మెంటు కొచ్చి పిల్లలు
భే షు గగా నాడిరపుడు భీతిని లేకన్ .

హీటరు చేసిన మేలును
నెట్టుల మరువంగ గలను నెప్పుడు నైనన్
అట్టిటు తిరుగుచు నుండియు
దట్టమమగు నుష్ణ మిచ్చి గట్టెక్కిం చెన్


Wednesday, March 3, 2010

లక్ష్మీ స్థానములు

౧.తామర పూవు
౨.మారేడు దళము
౩.ఏ నుగు కుంభ స్థలము
౪.ఆవు వెనక తట్టు
౫.ఆడవారి నుదురు

సత్య గు ణ ము

సత్యము ప్రా ణ ము ,ధర్మము
సత్యమయే జీ వగర్ర శాశ్వత గు ణ మున్
సత్యము మానము ,నిత్యము
సత్యమ్ముకు సాటిదొకటి జగతిని గలదే ?

సాధన

మీ సాధన నే జూ చితి
నాసాంతము చదువ తెలిసె యాముష్మికముల్
ఓ సా మీ ! కోటేశ్వర !
ఆసాంతము వ్రాసి తీ వ ! యాధ్యాత్మికముల్ .

Tuesday, March 2, 2010

అమ్మ

అమ్మను మించిన దైవము
ఇమ్మహిలో గానరాదు నెందున వెతకన్
అమ్మయె తొలి గురువాయెను
అమ్మకు జేజేలు గొట్ట హాయిని నిచ్చున్ .



అమ్మకు నాన్నకు నమములు
అమ్మా యన కరు ణ జూ పె నాదేవతయున్
కమ్మని మాటల భక్తిని
ఇ మ్ముగ బోధించె మాకు నిలలో మనగన్ .

నమములు అమ్మకు నాన్నకు
నమములు ఆ సాయి ప్రభుకి నమములు ఉమకున్
నమములు గిరిజా పతికిని
నమములయా వెంకటేశ! నమములు నీ కున్ .

అమ్మా ఎక్కడ నుంటివి
ఇమ్మా ఇక నీ దు నాజ్న నిను జే రుటకున్
సొమ్ములు నాస్తులు నన్నియు
వమ్మే నమ నింక నాకు వదులు దు నన్నిన్ .

సంతోష మాత మాయమ
సంతసము గ జే యుమమ్మ వత్సర మంతా
ఉత్సుకత నీ కు జే యుదు
నుత్సాహము తోడ పూ జ లొ య్యన మాతా!

శారద మాతకు నమములు
శారద మా గృపను జూడు శరణము నీవే
అరవింద ముఖము గలిగిన
శారదమా! నీకు నెపుడు సాగిల బడుదున్

విఘ్నముల నిత్తు నందురు
విఘ్నాధిప నిన్ను జనులు విఘ్నము లీయా
విఘ్నముల నాకు నీయకు
విఘ్నాధిప నిన్ను గొలుతు వేలుగ భక్తిన్ .

మహి సము లిద్దరు పుట్టిరి
మహిలో సంతోష మాత మహిమమ వలనన్
మహిసము లిద్దరి వయసులు
మహిమౌగా పాది నెలల మధ్యన నుండెన్ .

దండమయా శివ శంకర
దండమయా సాంబ నీ కు దండము శంభో
దండమయా నీలాంబర
దండమయా గరళ కంట దండము భవుడా!

అమ్మ ! శారద !యమ్మల కమ్మ వమ్మ !
నిన్ను సేవించు మనుజుడు నేగు దివికి
కాన నేనును సేవింతు కరుణ జూడు
సకల గుణముల కిరవైన శారదాంబ !

శారద మాతకు నమములు
శారద! మఱి దయను జూడు శరణము నీవే
తరియించుమమ్మ దీనుని
కోరను నిక నేది నిన్ను కువలయ నేత్రా !

తుండముచే నడ్డంకుల
నండకు రానీక గొట్టి యసముంబ్రాపున్
నిండ కృతి నోము కొరకై
కొండల రాచూలి కొడుకు గొలిచెద భక్తిన్


శ్రీ సాయీ యో సాయీ

నీ సాయము గోరుచుంటి నిలకడ కొరకై

ఈ సారికి దయ జూడుము

ఏ సాయము గోర నిన్ను నికపై సాయీ !

















Monday, March 1, 2010

విజయ

విజయోత్సాహము కలిగెను
విజయను నే బెండ్లియాడ వేవురి ఎదుటన్
విజయయె భార్యగ తగునని
ప్ర్రాజాపతి వ్రాసె నె పు డొ ఫలకము నందున్ .