ఇమ్మహిలో గానరాదు నెందున వెతకన్
అమ్మయె తొలి గురువాయెను
అమ్మకు జేజేలు గొట్ట హాయిని నిచ్చున్ .
అమ్మకు నాన్నకు నమములు
అమ్మా యన కరు ణ జూ పె నాదేవతయున్
కమ్మని మాటల భక్తిని
ఇ మ్ముగ బోధించె మాకు నిలలో మనగన్ .
నమములు అమ్మకు నాన్నకు
నమములు ఆ సాయి ప్రభుకి నమములు ఉమకున్
నమములు గిరిజా పతికిని
నమములయా వెంకటేశ! నమములు నీ కున్ .
అమ్మా ఎక్కడ నుంటివి
ఇమ్మా ఇక నీ దు నాజ్న నిను జే రుటకున్
సొమ్ములు నాస్తులు నన్నియు
వమ్మే నమ నింక నాకు వదులు దు నన్నిన్ .
సంతోష మాత మాయమ
సంతసము గ జే యుమమ్మ వత్సర మంతా
ఉత్సుకత నీ కు జే యుదు
నుత్సాహము తోడ పూ జ లొ య్యన మాతా!
శారద మాతకు నమములు
శారద మా గృపను జూడు శరణము నీవే
అరవింద ముఖము గలిగిన
శారదమా! నీకు నెపుడు సాగిల బడుదున్
విఘ్నముల నిత్తు నందురు
విఘ్నాధిప నిన్ను జనులు విఘ్నము లీయా
విఘ్నముల నాకు నీయకు
విఘ్నాధిప నిన్ను గొలుతు వేలుగ భక్తిన్ .
మహి సము లిద్దరు పుట్టిరి
మహిలో సంతోష మాత మహిమమ వలనన్
మహిసము లిద్దరి వయసులు
మహిమౌగా పాది నెలల మధ్యన నుండెన్ .
దండమయా శివ శంకర
దండమయా సాంబ నీ కు దండము శంభో
దండమయా నీలాంబర
దండమయా గరళ కంట దండము భవుడా!
అమ్మ ! శారద !యమ్మల కమ్మ వమ్మ !
నిన్ను సేవించు మనుజుడు నేగు దివికి
కాన నేనును సేవింతు కరుణ జూడు
సకల గుణముల కిరవైన శారదాంబ !
శారద మాతకు నమములు
శారద! మఱి దయను జూడు శరణము నీవే
తరియించుమమ్మ దీనుని
కోరను నిక నేది నిన్ను కువలయ నేత్రా !
తుండముచే నడ్డంకుల
నండకు రానీక గొట్టి యసముంబ్రాపున్
నిండ కృతి నోము కొరకై
కొండల రాచూలి కొడుకు గొలిచెద భక్తిన్
శ్రీ సాయీ యో సాయీ
నీ సాయము గోరుచుంటి నిలకడ కొరకై
ఈ సారికి దయ జూడుము
ఏ సాయము గోర నిన్ను నికపై సాయీ !
No comments:
Post a Comment