రాజ మార్గములందు, రచ్చల యందును మూత్ర విసర్జన ,మల విసర్జన చేయ రాదు
సంధ్యా వందనాది కార్య క్రమములు సక్రమము గా నిర్వర్తించ వలెను
జలముల ప్రవేశించి స్నానము చేయవలెను
సూర్యుడు ఉదయించునపుడు,ఆస్తమించునపుడు నిద్రించ రాదు
కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు ముఖము శుభ్రముగా కడిగి కొని అన్నము తినవలెను
పరులను నిందించ రాదు
తడి కాళ్ళతో నిద్రించ రాదు
ఉదయించు సూర్యుని చూడరాదు
బహిర్భూమికి పోయినపుడు తాను విడిచిన మలమును చూడరాదు
చేసిన పాపము ఇతరులకు చెప్పవలెను
గురువులను ,బ్రాహ్మణులను సేవించ వలెను