Thursday, February 28, 2013

పద్య రచన ---ఇల్లు -ఇల్లాలు

ఇల్లాలు  ముఖ్య  మింటికి
ని ల్లాలే  యిచ్చు  మనకు  నే సుఖ మైనన్
ఇల్లాలును హింసించిన
అల్లా మఱి యూరు కొనక  యాపద  లిచ్చున్ .


కాంచ , మూలము  గనుపాప  కైవ డియిల
ఇంటి దీ పము నిల్లాలె యెచట  నైన
ఇల్లు లేనిది  యిల్లాలు  గల్ల యేను
మంచి  యనుబంధ మేయది  యెంచి  చూడ . 

చేతు లారంగ శివ పూజ చేయవలదు

నాస్తి కుండొక దాప్తుని నగర మేగి
పలికె నిటులను  నాతని  పత్ని తోడ
చేతు లారంగ శివ పూజ  చేయవలదు
కారణం బేమన మనల గావ రాడు . 

పొట్టి వారు మిగుల గట్టి వారు

పేద యింటి యందు పెరిగిన  బహదూరు
శాస్త్రి , యయ్యె  మనల శాసకుండు
మూడు గజము లుండె  ముచ్చటగను
పొట్టి  వాడు  మిగుల  గట్టి వాడు 

Wednesday, February 27, 2013

కారమె మత్సరము గూ ర్చి కలహము రేపెన్

కౌరవ  పాండవు లిరువురి
కారయగా  జదువు  నేర్పె  నా  ద్రో ణు డెగా
వారికి   కర్ణుని  దుర హం
కారమె మత్సరము గూ ర్చి  కలహము  రేపెన్ 

దాన శీ లము

దానము  సేయట  యొక  కళ
దానము నిల  జేయువాడు  ధర్మా త్ముడగున్
దానములు  బెక్కు రకములు
వానిలొ  నేదానమైన బరగును  జేయన్ .

మొయిలు  వర్షించు  నిరతము  పుడమి  యందు
చేయు  నుపకృ తి  మిత్రుడు  ప్రియము  తోడ
పండ్ల  నిచ్చును  వృక్షము  బాగు గాను
దాన శీ లుని  గుణమిదె  ధర్మ నిరత !

 

Tuesday, February 26, 2013

ఆడ పిల్ల యనగ నపర మాత .

ఆడ పిల్ల పుట్ట  యవమాన పఱతురు
ఆడ పిల్ల గాదె ? యంకురంబు
వంశ వృద్ధి  జేయ  వరము గా  నిచ్చును
ఆడ పిల్ల యనగ  నపర మాత .
 

ఆడ పడుచు ననగ న ర్ధ మొగుడు

భర్త  చెల్లెలనగ బహు ముఖ్యురాలుగ
పరి గణిం తు రిలను  బంధు కోటి
భర్త కూడ  యామె మాటలు  విను గాన
ఆడ పడుచు నన గ  నర్ధ మొగుడు . 

తిరునాళ్లు

తిరునాళ్లు జరుగు  చుండును
వర వేంకట  నాధు కెపుడు  వర్షము లందున్
బిరబిర లాడుచు  జనములు
దరహాసము దోడ  నతని దరి  జేరుదురీ . 

తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ !

శబరి  పండ్ల న్ని  రుచిజూచి  సరిగ  నుండు
ఫలము  రామ చంద్రున కిడి  భక్తి  తోడ
ముక్తి నొందెను  జివరన భువిని , గనుక
తిని  భజించిన  ముక్తి  ప్రాప్తించు  ననఘ !

కామితార్ధము లీ యదు కనక దుర్గ

కామితార్ధము లీ యదు కనక దుర్గ
యనుట సరికాదు సోదర ! యమ్మ యిచ్చు
తనదు  భక్తుల కెపుడును  దనివి తీ ర
కోరు నవియె కా కనికను  గోర నవియు 

Monday, February 25, 2013

ఏకం సత్

ఏకం సతు నన నర్ధము
ఏకమె  గద  యాత్మ లందు రిహముంబరలోన్
ఏకము  పరమాత్ముండును
ఏకమె  మఱి  జీ వు డెల్ల  హృదయము  లందున్ .




పతిని దలదాల్చు స్వామికి వందనంబు

సకల  శుభములు  గలి గించు  శంకరునకు
ఆది  మధ్యాంత  రహితుడు  నాది దేవు
నకును , భవునకు ,తారకా నాధు ని ,నుడు
పతిని దలదాల్చు  స్వామికి వందనంబు 

ముద్దరాలి ముద్దు మోము దడిపె

పడుచు పిల్ల  యొకతె బంధు వనుచు  వచ్చి
నాదు  మనుమరాలు  నాగ మణిని
ముద్దు పిదప ముద్దు  ముద్దులే బెట్టగ
ముద్దరాలి  ముద్దు  మోము దడిపె 

తలుపు దీ యగ గని పించె దలుపు లమ్మ !

పూజ గదిలోన  నమ్మకు  బూజ సేసి
ధూప దీ పాలు  తదుపర పూప  పాయ
సంబు  లారగింపగ నిచ్చి  సంతసమున
తలుపు దీ యగ  గని పించె  దలుపు లమ్మ !

Sunday, February 24, 2013

మూల మూల లందు మోస ముండె

పల్లె టూరు లందు బాబాల గుడు లుండె
మూలమూల  లందు , మోస ముండె
అన్ని సరుకు  లందు  నను కోని  విధమున
మచ్చు కైన లేదు  మంచి  సరుకు

పద్య రచన -ఆకలి

ఆకలిని  మించు  శత్రువు
 మా కయి తే    గాన రాదు,  మమతలు  ద్రుంచున్ 
ఆకలి యు  జేయు దొంగగ 
ఆకలి మఱి మార్చు నింక   యాచకు నింగా . 

Saturday, February 23, 2013

బుద్ధు లెన్నొ జెప్పు బోడి గుండు

శిరసు లోన నుండు చిన్న మెదడు నిల
బుద్ధు లెన్నొ జెప్పు , బోడి గుండు
మిగుల వేడి యెక్కు మిట్ట  మధ్యాహ్నపు
టెం డ  దగులు కతన  మెం డు గాను 

కవి సమ్మేళనములు (పద్య రచన )

కవి సమ్మేళనములు నా
గవు లందరు  నొక్క చోట కలుసుకు  నుండిన్
కవితలు  బ్రశ్నలు  మొదలగు
వివిధములుగ జర్చ జేసి  వివరణ యిత్తుర్ 

కలడు కలం డనెడు మాట కల్లయె సుమ్మీ !

కల డంటివి  యా  విష్ణువు
కలడైనచొ జూపు నాకు కనకపు  కొండా !
కల గంటివేమొ  రేయిని
కలడు కలం డనెడు మాట కల్లయె  సుమ్మీ !

కనకపు కొండా =ముద్దుగా  బంగారు కొండా
అని సంబోధన 

బ్రద్ద లయ్యెను గగనము బాంబు వలన

బ్రద్ద లయ్యెను గగనము బాంబు వలన
బాగు బాగండి మీ మాట  బాగు బాగు
గగన మనగను శూ న్యమ్ము  గాద దలప
బ్రద్ద లగుటయ సరి గాదు భ్రమయ సామి !

బ్రద్ద లయ్యెను  వసుమతి  బాంబు వలన
బ్రద్ద లయ్యెను గోడలు  బాంబు వలన
బ్రద్ద లయ్యెను  మేడలు  బాంబు వలన
బ్రద్ద లయ్యెను  గగనము  బాంబు వలన

దిలుషుకు  నగరము  నందున
ఖలు లనబడు కొంద రచట  కథినపు  బుద్ధిన్
విలువగు  బాంబులు వెట్ట గ
పలవలుగా  బ్రద్ద లయ్యె  వసుమతి యపుడున్ . 


ఆకసంబున దారలు దక్కు వయ్యె

ఆకసంబున దారలు దక్కు వయ్యె
ఏమి  యంటిరి ? యాకసంబేను మిధ్య
తార లుండుట యును  లేదు ద ఱఛి  జూడ
తక్కు వను మాట  పొసగదు ధరణి లోన 

Friday, February 22, 2013

పోతన భారతము వ్రాసె బుధులు బొగడ గన్

లోతుగ  వెదకిన గానము
పోతన  భారతము , వ్రాసె  బుధులు బొగడ గన్
కేతన కొమరుడు  చక్కగ
మాత యయి న   శార దాంబ మమతలు నీ యన్ . 

పద్య రచన -నగర జీ వ నం

నగర  జీవనంబు నానాడు  దుష్కర
మాయె బాంబు  దాడు లాయె దరచు 
వలన  బ్రదుకు  దె ఱు వు  బహు భార  మగుటన
తప్ప దింక దయ్య  !  తనువు  వీ డ . 

Thursday, February 21, 2013

కోడలు గాదండి యామె కూతురు సమమే

మాడుగుల  వారి  కూతురు
కోడలు గా  వచ్చి మాకు  కూతురి  వలెనే
వీడక  యుండుట  గతనన
కోడలు  గాదండి యామె కూతురు  సమమే 

ఉగ్ర వాదులు -హింస

ఉగ్ర వాదులు బ్రభుతపై  నాగ్ర హించి
హింస  గావించు  చుండిరి  హేడు లగుచు
దారు ణం బది  బరికింప  యుగ్ర వాదు
లార ! జేయుడు  సత్కర్మ  లలిత ముగను . 

ముక్కును బం ధిం చు నెడల మోక్షము వచ్చున్


ఠక్కున  మరణము  నొందును
ముక్కును  బం ధిం చు నెడల , మోక్షము  వచ్చున్
మక్కువ గలిగిన భక్తిని
చక్కగ పూజిం చు నెడల  శం కరు నెపుడున్

మేనత్తను బెండ్లి యాడి మేయరు జేసెన్

తానేషు  లండనేగెను
మేనత్తను  బెండ్లి యాడి,  మేయరు  జేసెన్
వెన్నంటు  చెల్లి  కొడుకును
ఆనం  రాజేంద్రు  డ య్య ! యవగత  మయెనా ?

మొగలి రేకుల వాసన ముక్కు జెఱచు

మొగలి రేకుల  వాసన  ముక్కు జెఱచు
కాదు ,గూర్చును ముదమును ,గలుగు  హాయి
మొగలి  వాసన దగులగ ఖగ విరోధి
చెట్టు చుట్టును  దిరముగ  జేరి యుండు 

ప్రతిభ గలవాడు జగతిని బ్రదుక లేడు

జగము నంతను  నేలును శ్రద్ధ తోడ
ప్రతిభ గలవాడు,  జగతిని బ్రదుక లేడు
చదువు  సంధ్యలు  లేకుండ  జడుడు నైన
బ్రదుకు  దెరువును  బ్రతి వాడు  వెదుక  వలయు 

భీ ష్ముడు

అంప శయ్యన నున్నట్టి యార్య ! భీష్మ !
అగ్ర గురువుల శ్రేణి యం దగ్ర  గణ్య !
నీదు  మరణము దెలియును  నీ కు నౌర!
అందు కొనుమయ్య సాదర  వంద నాలు 

పద్య రచన =తెలుగు పద్యము

తెలుగు పద్యము నమరము తేలిక యును
అర్ధ మగునది సులువుగ  నందరకును
మూర్ఖు లందురు మృ తమని  మొరటు గాను
తెలుగు పద్యమ ! జోహార్లు  దెలుపు చుంటి 

Wednesday, February 20, 2013

నంద నందను నందను న్నరకు డార్య !

నంద నందను నందను న్నరకు  డార్య !
కాడు ,ప్రద్యుమ్న పేరును గలుగు  వాడు
మీ దు  మిక్కిలి  సొగసరి మేరు వత డు
కుంతి  పుత్రుడ   యర్జును డతని మీ రు 

Tuesday, February 19, 2013

గోయి తీసిన బడుదువు గోతి లోన

గోయి తీసిన  బడుదువు  గోతి లోన
అందు  సందియ మిసు మంత యైన  లేదు
కాన  గోతులం దీ య బో క మస లుటను 
మేలు బ్రజకు దే  శమునకు మిత్రు లార!

సీతారాముని యెడదను జీల్చితివి గదా

చిత్తము  నిండుగ  గొలువుము
సీతారాముని,  యెడదను  జీల్చితివి  గదా
రక్తపు నేత్రము తోడను
భీతిలి బ్రహ్లాదు  డంత  విల విల లాడెన్ 

ధూర్త లక్షణము

ధూర్త లక్ష ణంబు  దురవ గాహంబులు
పరుల  వృద్ది  జూచి  వగలు  జెందు
అతివి  నయము  గలిగి  యాపద  గలిగించు
మత్సరంబున మెలగు  మదిని  జెఱచు 

ఆవకాయ దినిన నమరు డగును

కార మధిక మగుట గడుపు మంట గలుగు
ఆవకాయ దినిన, నమరు డగును
పుణ్య కార్య లబ్ధముగ  గడప వచ్చు 
శేష జీ వితంబు  శివుని  యొద్ద 

Monday, February 18, 2013

సూర్య పుత్రుండు భీముడు శౌర్య ధనుడు

కవచ కుండల  ధారుడు కర్ణు డరయ
సూర్య పుత్రుండు, భీముడు  శౌర్య ధనుడు
కుంతి  మాతకు బుట్టిన  కొమరు డతడు
అన్న దమ్ములు భీ ము డు  కర్ణు  లపుడు

సోమనాధాలయము

సోమనాధుని యాలయ  సొగసు జూడ
వేయి  కన్నులు జాలవు , వీ ను లలర
సుప్ర భాతము వినవచ్చు  సుస్వ రమున
రాణ  యొప్పగ గుజరాతు  రాష్ట్ర  మందు

సోముని  సౌందర్యంబును
వేమారులు  జూడ నింక  వీక్షణ జేయన్
మామనములి చ్చగించును
నేమముతో  సేతు బూజ నిర్గుణు నకునున్ 

కలకాలము బ్రదుకు వాడు కామాతురుడే

కలియుగ మందున  కాముని
దలపున  నున్నట్టి  వాం ఛ  తలపున నే యౌన్
వలపులు  దీ రున  దనుకను
కలకాలము  బ్రదుకు  వాడు , కామాతురుడే .

బ్రహ్మ సృష్టికి మూలము బ్రాహ్మణుండు

బ్రహ్మ  సృష్టికి మూలము బ్రాహ్మణుండు
కాదు ,సృష్టికి  మూలము కామ వైరి
సకల  ప్రాణుల సృజన నీ జగము నందు
బ్రహ్మ  వలనన  గావింప బడెను సుమ్ము .

Sunday, February 17, 2013

చదువులలో సార మె ఱిగి చక్రిని దిట్టెన్

చదువుదు దండ్రీ! యెప్పుడు
చదువులలో సార మె ఱిగి , చక్రిని దిట్టెన్
మదమున హిరణ్య కశిపుడు
మది లోపల నావహించి మరణపు భయమున్

సీతాకోక చిలుక


కీట కంబుల యందున మేటి యైన
కీ ట కంబు సీ తాకోక కీట కంబు
చిలుక జాతికి వచ్చును , జిందు లేయు
అంద మందున సాటిది యెందు లేదు .

 
 
 

నేమాని వారి జన్మ దిన శుభా కాంక్షలు

గురువు  సముడవు ,నేమాని  గురు వరేణ్య !
సకల శుభములు  గలిగించు  శంకరుండు
ఆయు రారోగ్య  సంపద లన్ని  యిచ్చి
కంటికిని ఱె ప్ప యట్లయి  కాచు గాత !

శ్రీ కృష్ణుని మేనమామ సీ తా పతియే

భీ కర  నేత్రుడు   కంసుడు
శ్రీ కృష్ణుని  మేనమామ,  సీ తా పతియే
గోకుల నాధుని రూ పము
శ్రీ కృష్ణుడు  రాము డనగ శ్రీ కర  మూర్తుల్ 

అమ్మ కాదిది యవునుర యమ్మ యేను

దారి బోవుచు సోముడు  తనయు తోడ
అమ్మ వేషము గలిగిన  బొమ్మ జూచి
కలవ  రము జెంది  బలికె ను  గనుము  తనయ !
అమ్మ కాదిది,  యవునుర  యమ్మ యేను  .

సూర్య స్తోత్రము

అరుణ కిరణు డ ! వినతుల  నందు  కొనుము
లోక బాంధవ! దినకర ! లోక రక్ష!
తూర్పు పడమర లందు నీ తేరు  తిరుగు
చుండి ,వెలుగులు  బ్రస రించు చుండు  నెపుడు .

Saturday, February 16, 2013

పద్య రచన -మొక్క జొన్న పొత్తు

మొక్క జొన్న పొత్తు  మురిపించె  మమ్ముల
ముత్యములను బోలు  విత్తు తోడ
ఉడక బెట్టి మఱియు  నుప్పు వేసి  దినిన
జాల రుచిగ  నుండు  సామి ! నిజము 

కవిత లల్లు నతడు కా పురుషు డు

కవిత లల్లు  నతడు  కా పురుషు డనుట
వింత గాదె మనకు ? వినుట  కింపు
గాదు , సామి ! యరయ  కవిత లల్లు నతడు
కవి యనంగ  బరగు  కవి వ రేణ్య !

పాపాలను జేయువాని బార్వతి మెచ్చున్

పాపాల రావు  గారనె
పాపాలను  జేయువాని ,బార్వతి  మెచ్చున్
ఏ పాపములను జేయక 
మా పాలిట  దేవ త యని  మాతను  గొలువన్ 

Friday, February 15, 2013

ఆత్మ హత్య జేయు నాయు వృద్ధి

ఱేడ! పాపములను  రెట్టింపు  జేయును
ఆత్మ  హత్య,  జేయు నాయు వృద్ధి
సుఖము సంతసములు  ముఖ్యము గను  గల్గ
నాత్మ హత్య  పాప మండ్రు  బుధులు .

 

బంధంబుల ద్రెంచు కొనిన పరమ శివు డగున్

బంధంబు  లుంచు కొన్నను
బంధంబులు  ద్రెంచు కొనిన  భవుడ వడు ను లే
అంధుల  మాటలె  యీయవి
బంధంబుల  ద్రెంచు కొనిన  పరమ శివు డగున్
 

పరమేశ్వరు ముఖము నుండి పాములు బుట్టున్

అరవిందు పలికె  నిటులను
పరమేశ్వరు ముఖము నుండి పాములు  బుట్టున్
పరమేశా ! వినరానది
తిరముగ  విన వలసి  వచ్చె  తిక్కని మాటల్ 

పార్ధ సారధి కౌరవ పక్ష పాతి

పార్ధ సారధి  కౌరవ పక్ష పాతి
కాదు కాదండి  నిజముగ  గాదు గాదు
పార్ధ సారధి  పాండవ  పక్ష పాతి
బయలు వెడలును  సత్యము  భారతమున .

పద్య రచన -చరకుడు

ధర  యాయుర్వే దంబును
చరకుండు  రచించె నొక్క  శాస్త్రంబ నగా
జ్వరములు  ముదిరిన  వైనచొ
చరకుని ముని  మందు వలన  చప్పున  దగ్గున్ .

Thursday, February 14, 2013

సరస్వతీ దేవి

శారద మాతకు వినతులు
శారద మా గృపను జూడు శరణము నీవే
నీ రజ ముఖమును బోలిన
శారదమా! నీకు నెపుడు సాగిల బడుదున్

 

మురళీ ధర !

మురళీ  ధర! నే   జేతును
నిరతము  శత  వందనంబు  నియమము  దోడ న్
సురుచిర మే మీ  పద్యము
ఇరు యర్ధము లుండె సామి !యే ల్చు రి  మురళీ !

వడ్డన సాగించు మమ్మ ! వరుసకు వదినా !

మడ్డుగ నుంటివి యే లకొ ?
గుడ్డలు నిక  నారవేసి  గోడల మీదన్
బిడ్డల  యాకలి దీర్చగ
వడ్డన సాగించు మమ్మ ! వరుసకు  వదినా !

Wednesday, February 13, 2013

మన్ను మిన్ను గలియు మధుర యొద్ద

మన్ను మిన్ను  గలియు  మధుర యొద్ద ననుట
నిజము గాదు , రెండు నిజము గా క
లువవు  నెప్ప  టికిని  లూ పు లైనులు  నవి
మన్ను దిగువ , పైన   మిన్ను  లుండు
 

పద్య రచన -పెండ్లి కూ తురు

పెండ్లి  కూతురు నెత్తుకు  బెండ్లి దరికి
వచ్చు  చుండిరి మామలు  వడి వడిగను
మూర్త  మగు చుండె  గాబోలు  మోము లందు
సంత  సంబులు  గనుపించె  సర్వు లందు 

అభినందనలు (శంకరయ్య గారికి )

అభినందన పత్రమ్మును
నభి మతముందోడ మీ కు  నార్యులు  నొసగన్
అభి నందించుచు  మిమ్ముల
నభి వాదము  జేయు చుంటి  నార్యా ! కం .శం .!


కం .శం . అనగా  కంది  శంకరయ్య  గారు
ఇలా  వ్రాసి నందులకు   క్షంతవ్యుడను
 

ప్రేమ యనిన దవడ బేల గొట్టె

సంత సించె  సరిత  తానన  భర్తకు
ప్రేమ యనిన ,  దవడ బేల గొట్టె
చెలియ ! రావ యనుచు  చేయిప ట్టు కొనగ
నెలత  మనసు  నె  ఱి గి  మెలగ వలయు .

పరమ పదము వచ్చు బతిని గొలువ

పరమ పదము  వచ్చు పతిని  గొలువ గను
సంది యంబు  వలదు, శ త విధముల
గొలువు డ మ్మలార ! కోరిక  మీ రంగ
నందు కొనుడు నంజ లందు  కొనుడు .

పతియ దైవ మనుచు బతి దేవు బ్రియమున
గౌర  వించు నామె  గొప్ప వనిత
యట్టి  పతిని నెపుడు  నాద రించ ,దివిని
పరమ పదము  వచ్చు బతిని  గొలువ
 

Tuesday, February 12, 2013

పద్య రచన -నేతన్న

చిత్ర మాయది  చూడుడు  నేత్ర పర్వ
మాయె , నేతన్న  యనుదిన  మటుల  గాను
నేత చీ రలు  ధో వతుల్  నేయు చుండు
రంగు రంగుల  దోడన  రమ్య ముగను .

దాశ రధి యనంగ ధర్మ రాజు

దశ రధుని కొమరుడు, ధర్ముడు, రాముడే
దాశ రధి యనంగ , ధర్మ రాజు
పాండు రాజు యొక్క  ప్రధమత  నయుడేను
రామ  ధర్మ జులిల  సౌమ్య  భవులు .

 

కాలుని సేవించు నెడల కనకము నిచ్చున్

తెల్లటి  విభూది  రేఖలు
ఫాలంబున  నుండు  నతడు ,పరమే శ్వ రుడున్
నీ లపు  కం ధర ముండిన
కాలుని  సేవించు  నెడల  కనకము  నిచ్చున్ .

Monday, February 11, 2013

పద్య రచన -కాకాసుర వృత్తాంతము

చిత్ర కూ టమ్ము  నందున  సీ త యుండ
కాక యను బేరు గల యట్టి  నొక్క యసురు
డంత  జానకి  వ్రేలును  గొంత పొడువ
కన్ను బోగొట్టి  కొనియెను  కాకి  ప్రతిగ 

పశ్చిమంబున నుదయించు బగ టి రేడు

సూర్య భగవాను డస్త మించును గ దార్య !
పశ్చిమంబున , నుదయించు  బగ టి  రేడు
తూర్పు దిశ యందు తప్పక , మార దెపుడు
రాత్రి బగలులు  నేర్పడు రవియు వలన

 

పాపము లంజేయువాడె పరముంగాంచున్

తప్పక  నరకము  బోవును
పాపము లంజేయువాడె,  పరముంగాంచున్
పాపములను విడ నాడుచు
నేపొద్దును  సేవ జేయ  యిష్టత  యున్నన్ .

Sunday, February 10, 2013

పద్య రచన -శ్రీ రాముని వనవాస గమనము

తండ్రి  యాజ్ఞను  రాముడు  దాట లేక
బయలు  దేరెను  నడవికి  భామ తోడ
వెంట సాగెను  లక్ష్మణు డొంటి గాను
చూడు డార్యులు  చిత్రము  సొబగు దనము .

దాశరధి యన దెలియుము ధర్మ రాజు

దశరధ ప్రభుని ముద్దుల తనయు డేను
దాశరధి యన,  దెలియుము  ధర్మ రాజు
పాండ వాగ్రే స రుండు గ  భార తమున
రామ ధర్మజు  కధలన్ని  రక్తి గూ ర్చు .

 

తారకాసురు మర ణించె తనయు వలన

శంభు కొమరుండు  వీ రుడు  స్కంధు వలన
తారకాసురు  మర ణించె , తనయు వలన
నింటి వాడయ్యె  మఱి యొక  యింతి  బొంది
తనయు  నౌదార్య  మెన్నగ  తరమె మనకు ?
 

పద్య రచన -దోసి ,సాంబారు ,కొబ్బరి పచ్చడి

పళ్ళె మందున  ముద్దుగ పఱచి రచట
దోసె  మఱియును  సాంబారు  తోటి గిన్నె
పచ్చి కొబ్బరి తోడన  పచ్చడి యును
 రండి  పంచుకు  తింద ము   రామ లార !
 

Saturday, February 9, 2013

గజమును గట్టుటకు బచ్చ గడ్డిని దెచ్చెన్

విజయుడు  గొలుసులు  దెచ్చెను
గజమును  గట్టుటకు , బచ్చ గడ్డిని  దెచ్చెన్
అజయుడు  లేగకు  కొఱకని
అజవిజయులు న  గుదు రిద్ద రన్నా దమ్ముల్ .

Friday, February 8, 2013

పద్య రచన -మనిషి ,అద్దము

మనిషి  యొక్క డు  నిలబడి మమత తోడ
అంద  చందాలు  దనవియా  యద్ద మందు
చూడ సాగెను జిత్రాన  చూడు  డార్య !
యెవరి  యందము  వారికి  యింపు  గాదె ?
 

పద్య రచన -కన్నాంబ

కన్నాంబ ను  జూ డంగ నె
మిన్నందె ను  సంత సంబు  , మీ కును  గాదా ?
యెన్నంగ  నటన యామెది
మున్నెవ్వరు  సాటి రారు  మురిపెము లందున్ .

Thursday, February 7, 2013

మూ డు ముక్క లాట ముక్తి నొసగు

మూ డు ముక్క లాట  ముక్తి  నొసగు నన
మంచి వారు కూ డ  మంది గూడి
మూడు ముక్క లాట లాడ జూతురు గద
మంచి యుండ దెవరి  మనసు లోన .

చెట్లు చేమలు జిగు రించె శైత్యమునకు

చైత్ర మాసంబు  రాకను  జిత్రముగను
చెట్లు  చేమలు జిగు రించె,  శైత్యమునకు
చెట్ల పూ తలు మాడెను  జిగురు తోడ
మాస మాసము  ధర్మము  మారు చుండు 

శ్రద్ధాంజలి --(ముమ్మిడివరప్పాడు మామయ్య గారు )

లేవు  లేవాయె  యిక మాకు  లేవు  నీ వు
ఎచట  కేగితి నీ వయ్య !  యిచట  నుండి
వత్తు  వెప్పుడు  మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు  చూతుము  నీ కోస  మిచ్ఛ తోడ .

కాన  రానట్టి  దూ రంబు  గడచి నావు
కాను పించుమ  యొక సారి ,కాంచి  నిన్ను
సేద దేరుదు  మో సామి ! చింత  నుండి
రమ్ము  మామయ్య!  రయముగ  నిమ్ము  గాను .

బంధు ప్రీ తిని  గలిగిన  బాంధ  వుండు
స్నేహ సంపద నొందిన  చెలియ  కాడు
భువిని  యిరగ వ  రపు వంశ  బుధు డతండు
కల్ల  కాదిది  నిజము నే  బలుకు చుంటి .

మాయ  మర్మము  లెరుగని  మనిషి వీ వ !
మత్స రంబును నీ కిసుమంత  లేదు
సాటి  మనుజుని  మనిషి గా  సాకి నావు
సాటి  యెవరయ్య ! నీ కిల  సాటి యెవరు ?

ఎందు బోయితి వుందువు  నెచట  నీ వు ?
నేను  వత్తును  జూపించు  నీ దు  దారి
నేడు  జూడంగ  మీ యిల్లు  పాడు పడియు
మారె  దెయ్యాల కొంపగ మారె  నయ్య !

అమర లోకంబు  జేరితి వయ్య ! నీ వు
అమరు లందఱు  నిను జూచి  యాద  రించ
మసలు  గొనుమయ్య ! యక్కడ  మాన్యు రీ తి
నాదు  కొనగను  నమరులు   హాయి గుండు .

ఒజ్జ  వృత్తిని  జేబట్టి  యొప్పు గాను
అక్ష రంబులు  నేర్పిన  నార్య ! మీ రు
చిన్న  పిల్లల మనసులో  చెఱగ  కుండె
మంచి  మమతలు  గలిగిన మనిషి వనుచు .

మీ తో  గడిపిన  రోజులు
చేతో  మోదంబు  గలిగె  చిన్మయ రూ పా !
మాతో బలికిన  బలుకులు
నెంతో విలువైన  వయ్య ! యెంచగ  నిపుడున్ .

సకల శుభములు గలిగించు  శంక రుండు
మరల జన్మంబు లేకుండు  వరము  నిచ్చి
పుణ్య లోకాలు  జేరగ  ననుమ తించి
నీ దు  నాత్మకు  శాంతిని  నిచ్చు గాక !

మీ రు లేనట్టి  లోటును  మేము దీ ర్చ
లేము , భార మంతయు  నిక నా మురహరి
చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము .

అశ్రు నయనాలతో ......
(కుటుంబ సభ్యుల  అనుమతిని )
పోచిరాజు సుబ్బారావు
3-2-2013

(శ్రీ ఇరగవర పు  రామ  కృష్ణారావు గారి వర్ధంతి  సందర్భముగా )



 

Wednesday, February 6, 2013

పద్య రచన - సూ ర్యు డు ,కుంతి

మౌని  దూ ర్వాసు వరమును మనన జేసి
సూ ర్య  భగవాను బిలువంగ  స్యోను  డంత
కుంతి  కిచ్చెను  కర్ణుని , కొడుకు గాను
పెళ్లి   కానట్టి  పిల్లకు  ప్రియము  తోడ .

ఆధార్ కార్డు

ఆధార  కార్డు లేనిది
సాధారణ  బ్రతుకు  కూడ  జరుగుట  కష్టం
ఆధార మన్ని పనులకు
ఆధారమె  ప్రాణ మిపుడ  యాయువు  కంటెన్ .

Tuesday, February 5, 2013

సత్సంగము

సత్సంగము  మొద లాయెను
మత్సరములు  మాని మీ రు  మమతలు  గలి గీ
యుత్సా హంబున  రండిక
వత్సలు దమ  తల్లి జేరు వడుగున  సా మీ !

సత్సంగ  మాయు  విచ్చును
సత్సంగము  దెలివి నిచ్చు  సంతస మిచ్చున్
సత్సంగ మాన కెన్నడు
సత్సంగమె  ముక్తి నిచ్చు  సతతము  నరుడా !

భగ వద్భా రతి  పొత్తము
నిగమంబుల  సాటి దౌను  నిరతము  చదువన్
విగతత్వము  రాదెన్నడు
సుగతులనే  బొంద  వచ్చు  సూ నృత మిదియున్

సత్య గురువులు  నిత్యము  శ్రద్ధ  తోడ
వంద నంబులు  సేతురు   సంధ్య వేళ
దాని పిమ్మట  యొక గంట  ధర్మ ములను
బోధ సేతురు  మాకవి  వేద  వాక్కు .

వందనము

వందనము సత్య  గురునకు
వందనమో  సాయి నాధ ! వందన  మమ్మా !
వందనము  విష్ణు మూ ర్తికి
వందన మో నీ ల కన్థ ! వందన  మార్యా !

దత్త పది =తల,భారతార్ధము ,శిరస్సు అను అర్ధము మినహా

తలచియు  పాండవ  బలమును
తలమే  మఱి  వారి యెదుట  తలపగ మనకున్
తలపుల యందును  నైనను
తలపగ నిక  వారి నిలను  దరమే  నీ కున్ ?

పద్య రచన - బ్రహ్మ ,విష్ణువు ,మహేశ్వరుడు

బ్రహ్మ  విష్ణులు  చెరి యొక  వైపు నుండి
తార కాసుర మర్దుని  దండ్రి  కచట
పెట్టు చుండిరి  దండముల్  బిట్టు గాను
ఆది దేవుని  కయ్యది  యర్హ మేను .

శ్రీ తల్లా ప్రగడ!

శ్రీ  తల్లా ప్రగడ వారికి ,
మాతృ భాష మీద మమకారము వలన
చేయు చున్న కృషికి చేతు లెత్తి
వంద నంబు లిడుదు నందు కొనుము సామి !
రావు  నామంబు  గలిగిన  రసిక హృదయ ! 

Monday, February 4, 2013

ఖర గానమె మెప్పు లొందె గాయక సభలో

బిరుదములు బొందు వారలు
సరగున బాడంగ  సభను  శాస్త్రోక్త ముగా
సరసము గలిగిన యా శే
ఖర గానమె మెప్పు లొందె గాయక  సభలో .

పద్య రచన -పరమాత్మ

పాల కడలి వాస ! !పరమాత్మ !మురహర !
కావ రమ్ము మమ్ము , కనిక రింఛి
పాండు రంగ ! శేష పానుపు  శయ నుండ !
వేచి యుంటి మ య్య ! వేగ  రమ్ము .
 

మూ డె పదవి కీ ర్తి పుష్కల ముగ నగు

లంచ గొండు  తనము నెంచు కారణ మున
సోము డయ్యె శత్రు వుముర హరికి
మూ డె పదవి , కీ ర్తి పుష్కలముగ నగు
లంచ గొండు  తనము నెంచు కతన 

పండు వెన్నెల గాసెను, బట్ట పగలు

నేడు  పౌర్ణమి  యగుటన  నీ లి ఖగము
పండు వెన్నెల గాసెను,  బట్ట పగలు
యెండ  తీ వ్రత జూ డగ  మెండు  గుండె
చెట్లు  చేమలు  సర్వము  చితిగ  మారె
 

పద్య రచన -వజ్ర కి రీ టము

వజ్ర కాంతులు  ధగ ధగ మెరయు చుండ
కరము నందున  చక్రము  కాంతు లీ న
శార్గ ధన్వాది యాయుధ  సమితి తోడ
నలరు మురహరి కి నిపుడ యంజ లింతు

 

పద్య రచన-రంగ నాధ స్వామి

పాండు రంగ ! శేష పానుపు  శయ నుండ !
వెన్న ప్రియుడ ! హరుడ! వేంకటేశ !
కావ మమ్ము  రమ్ము కన్నయ్య !మురహర !
వేచి యుంటి మిచట  వేగ రమ్ము .

Sunday, February 3, 2013

పద్య రచన -ఇట లీలో శివుడు

శివు డం తా వ్యా పించును
భవుడే  మఱి  లేని చోటు  భరణి ని  గలదే ?
శివ శివ  యని దను  పిలువగ
నవిరళ ముగ  నిచ్చు  మనకు  నాయువు  సిరులన్ .

హంస పాలను వీ డు దోయముల ద్రావు

హంస పాలను వీ డు దోయముల ద్రావు
ననుట  సరి కాదు విను డ య్య ! హంస , పాల
కలియు  నీ టిని  విడ దీ యు  సులువు  గాను
నీ శు డి చ్చెను   హంసకు నీ ని  పుణత .

పద్య రచన -ఇడ్లీ లు

ఇడ్లీ లున్నవి యక్కడ
యి డ్లీ తో  బాటు యుండె  నిరవగు  ఛ ట్నీ
యి డ్లీ  ఛ ట్నీ కంటెను
యి డ్లీ సాంబారు  కలిపి యిష్టత దిందున్