Sunday, May 12, 2013

పూతరేకులు

పూతరేకులు  సేసి మా పొరుగు వారు
అమ్ము చుందురు  వారపు  టం గడులకు
శుచిగ నుండునాస్వాదిం ప  రుచిగ నుండు
తీ య తీ యగ వానిని నిని  దినగ  రం డు 

1 comment:

  1. సుబ్బారావు గారు!
    నోరూరించే పద్యాన్ని అందించారు. అభినందన!
    ఒక చిన్న సూచన -
    మూడవ పాదాన్ని "శుచిగ నుండు, నాస్వాదింప రుచిగ నుండు" అని మారిస్తే ’మరియును’ వంటి వ్యర్థ పదాన్ని పరిహరింప వచ్చు. అంతే కాకుండా బిందు పూర్వక ’డ’కారం అనుప్రాసగా వచ్చి పద్యం అందగిస్తుంది.
    ఈ అనుప్రాసకు కొనసాగింపుగా నాలుగవ పాదంలో "రండి" బదులు "రండు" అంటే మరింత అందగిస్తుంది.
    అలాగే .. "వాటిని" అసాధు రూపం. "వానిని" సాధు రూపం.
    సరి దిద్దిన పద్యం -
    "పూతరేకులు సేసి మా పొరుగు వారు
    అమ్ము చుందురు వారపు టంగడులకు
    శుచిగ నుండు, నాస్వాదింప రుచిగ నుండు
    తీయ తీయగ వానిని దినగ రండు."

    ReplyDelete